News December 21, 2025
20 రోజుల్లో మూడు సభలు నిర్వహించనున్న BRS

TG: రాబోయే 20 రోజుల్లో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలో మూడు సభలు నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. తొలుత మహబూబ్ నగర్(పాలమూరు) ఆ తర్వాత రంగారెడ్డి, నల్గొండలో సభలు నిర్వహించాలని పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకుంది. కృష్ణా జలాల సాధనకై పోరు చేయాలని పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
Similar News
News December 28, 2025
50 మందికి పైగా దుర్మరణం.. సిగాచీ CEO అరెస్ట్

TG: సిగాచీ కంపెనీ CEO అమిత్‌రాజ్‌ను పటాన్‌చెరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఏడాది జూన్‌లో సంగారెడ్డి(D) పాశమైలారంలోని సిగాచీ కంపెనీలో భారీ పేలుడు సంభవించి 50 మందికి పైగా కార్మికులు మరణించారు. దీంతో ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా నిన్న రాత్రి CEOను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అటు బాధితులకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని యాజమాన్యాన్ని హైకోర్టు ఇప్పటికే ఆదేశించింది.
News December 28, 2025
సాగు కోసం వర్షపు నీటిని కాపాడుకుందాం

వ్యవసాయానికి వాన నీరే కీలకం. ఈ నీటిని పరిరక్షించి, భూగర్భ జలాలను పెంచుకోవడం చాలా అవసరం. దీని కోసం వర్షపు నీరు నేలలో ఇంకేలా వాలుకు అడ్డంగా కాలువలు, కందకాలు తీసి నీరు వృథాగా పోకుండా చూడాలి. నీటి గుంటలు, చెక్‌డ్యామ్స్, ఫామ్‌పాండ్స్ ఏర్పాటు చేసి భూగర్భజలాలను పెంచవచ్చు. బీడు భూముల్లో చెట్ల పెంపకం, సామాజిక అడవుల పెంపకం చేపట్టాలి. దీని వల్ల భూగర్భ జలాలు పెరగడంతో పాటు నేలకోత తగ్గి భూసారం పెరుగుతుంది.
News December 28, 2025
CCMBలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే ఆఖరు తేదీ

హైదరాబాద్‌లోని <


