News November 21, 2024

20 వేల ఎకరాల్లో ఎడారికన్నా దారుణమైన పరిస్థితులు: ఎమ్మెల్యే కాలవ

image

వెనుకబడిన ప్రాంతాల్లో అత్యంత వెనుకబడిన ప్రాంతం రాయదుర్గం అని ఎమ్మెల్యే శ్రీనివాసులు అసెంబ్లీలో పేర్కొన్నారు. జైసల్మేర్ ఎడారి అయిపోతుందని గగ్గోలు పెడుతున్నారని, కానీ నియోజకవర్గంలో 20వేల ఎకరాల్లో ఎడారికన్నా దారుణ పరిస్థితులున్నాయన్నారు. సినిమాల్లో ఎడారి దృశ్యాలను ఇక్కడ చిత్రీకరించుకుంటారన్నారు. అలాంటి ఎడారీకర నివారణ కోసం నిధులు కేటాయించాలని కోరగా, ‘ఎడారీకరణ మంచి పదం’ అని Dy స్పీకర్ కితాబిచ్చారు.

Similar News

News November 21, 2024

‘అనంత కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి’

image

ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలపై ఈనెల 26న సీపీఎం ఆధ్వర్యంలో అనంతపురం కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని సీపీఎం నాయకులు రామంజి నేయులు పిలుపు నిచ్చారు. సోమలదొడ్డి IML డిపో దగ్గర హమాలీలతో కలిసి కరపత్రాలు విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. ధర్నాకు కార్మికులు ,రైతులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు.

News November 21, 2024

మాజీ ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డికి మాజీ సీఎం జగన్ పరామర్శ

image

గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డిని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో సర్వైకల్ ఆపరేషన్ చేయించుకున్న వైవీఆర్‌ను అర్ధరాత్రి వీడియో కాల్ ద్వారా యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని ఆకాంక్షించారు. ఆపరేషన్ సక్సెస్ అయిందని, 15 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని వైవీఆర్ వివరించారు.

News November 21, 2024

రూ.9 లక్షల 74 వేల కోట్ల అప్పులు: ఆర్థిక మంత్రి పయ్యావుల

image

గత ప్రభుత్వం విచ్చల విడిగా అప్పులు చేసిందని, ఈ ఏడాది జూన్ నాటికి రూ.9 లక్షల 74 వేల కోట్లుగా తేలాయని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. బుధవారం శాసనమండలిలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అప్పులు చేయాల్సి వస్తే చట్టసభల అనుమతితో చేయాలని కానీ.. గత ప్రభుత్వం చట్టసభల అనుమతి లేకుండా రూ.వందల కోట్లు అప్పు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.