News April 1, 2024

ఏఐతో మానవాళి అంతానికి 20శాతం ఛాన్స్: మస్క్

image

ఏఐతో మానవాళి పూర్తిగా అంతమయ్యేందుకు 20శాతం వరకు ఛాన్స్ ఉందని టెస్లా వ్యవస్థాపకుడు మస్క్ అభిప్రాయపడ్డారు. ‘దానితో ఉన్న ఉపయోగాల దృష్ట్యా ఆమాత్రం రిస్క్ తీసుకోవడం తప్పదు. ఏఐను అభివృద్ధి చేయడమంటే పిల్లాడిని పెంచినట్లే. ఆ పెంపకం ఎలా ఉంటుందన్నదానిపై తుది ఫలితం ఆధారపడి ఉంటుంది. ఎప్పుడూ నిజమే చెప్పేలా శిక్షణనివ్వడం కీలకం. ఒకసారి అబద్ధాలు మొదలుపెడితే, దానికి అంతు ఉండదు’ అని హెచ్చరించారు.

Similar News

News November 7, 2024

శీతాకాలంలో శరీర రక్షణకు ఇవి అవసరం

image

శీతాకాలం వచ్చేసింది. అనేక ఆరోగ్య సమస్యలు శరీరంపై దాడి చేస్తాయి. ఈ నేపథ్యంలో రోగనిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు విటమిన్ సీ, విటమిన్ డీ, జింక్, విటమిన్ ఏ, విటమిన్ ఈ, ఐరన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, బి విటమిన్స్, ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉండే ఆహారాన్ని తినాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఆకుకూరలు, పండ్లు, పాల పదార్థాలు, చేపలు, గుడ్లు, డ్రైఫ్రూట్స్ వంటివి సమృద్ధిగా తీసుకోవాలని పేర్కొంటున్నారు.

News November 7, 2024

బెల్టుషాపులపై మంత్రి కీలక ఆదేశాలు

image

AP: ఎక్సైజ్ శాఖ అధికారులతో మంత్రి కొల్లు రవీంద్ర సమీక్ష నిర్వహించారు. ఎమ్మార్పీ ఉల్లంఘనలు, బెల్టుషాపులను ఉపేక్షించవద్దని ఆదేశించారు. తప్పు చేసినవారు ఎవరైనా శిక్ష తప్పదనే సంకేతాలు ఇవ్వాలని సూచించారు. కల్తీ మద్యం రహిత రాష్ట్రంగా ఏపీని మారుద్దామని పిలుపునిచ్చారు. తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందించాలని సూచించారు.

News November 7, 2024

ఈ నెల 19, 20న ఆర్టీసీ ఈయూ నిరసనలు

image

AP: ఉద్యోగ భద్రత సర్క్యులర్ యథావిధిగా అమలు చేయడంతో పాటు ఇతర డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నిరసనలు చేపట్టనుంది. ఈ నెల 19, 20న ప్రొటెస్ట్ చేయాలని ఉద్యోగులకు పిలుపునిచ్చింది. సిబ్బంది ఎర్రబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవ్వాలని సూచించింది. ఆర్టీసీ డిపోలు, వర్క్ షాప్‌ల వద్ద ధర్నాలు చేయాలని ఉద్యోగులకు సూచించింది.