News November 1, 2024
20 సిలిండర్ల డబ్బు లాగేస్తున్నారు.. YCP వెర్షన్

AP: ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి ప్రభుత్వం రూ.2,685 కోట్ల సబ్సిడీ అందిస్తోంది. అయితే ఇదంతా ఎడమ చేత్తో ఇచ్చి కుడి చేత్తో లాక్కుంటున్నట్లు ఉందని YCP ఆరోపిస్తోంది. విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో నేటి నుంచి ప్రజలపై రూ.17,072 కోట్లు భారం మోపుతున్నారంటోంది. ఏడాదికి 3 సిలిండర్లు ఇస్తున్నామంటూ 20 సిలిండర్ల డబ్బుల్ని సర్కార్ వసూలు చేస్తోందని YCP చురకలంటిస్తోంది. నిబంధనలతో అందరికీ స్కీమ్ అందడం లేదంది.
Similar News
News November 14, 2025
ఆలు లేత, నారు ముదర అవ్వాలి

ఈ సామెతలో ఆలు అంటే తమలపాకు. అది ఎంత లేతగా ఉంటే అంత రుచిగా, మృదువుగా ఉంటుంది. అలాగే మనిషి కూడా కొన్ని(స్వభావం, మాటతీరు) విషయాల్లో మృదువుగా, సున్నితంగా ఉండాలి. ఇక్కడ నారు అంటే వరి నారు, మొక్కల నారు. అది నాటే సమయానికి ముదురుగా ఉంటేనే మంచి పంట వస్తుంది. అలాగే మనిషి కూడా కొన్ని విషయాల్లో (విలువలు, నిర్ణయాలు, పట్టుదల) దృఢంగా, స్థిరంగా ఉంటే మంచిదని ఈ సామెత అర్థం.
News November 14, 2025
SAvsIND: ఈ‘డెన్’ మనదేనా?

కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో దక్షిణాఫ్రికాతో నేటి నుంచి టీమ్ఇండియా తొలి టెస్టు ఆడనుంది. ఈడెన్లో 42 మ్యాచులు ఆడిన భారత్ 13 గెలిచి, 9 ఓడగా మరో 20 మ్యాచులు డ్రాగా ముగిశాయి. చివరగా 2019లో BANతో జరిగిన టెస్టులో భారత్ గెలిచింది. అయితే ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్ SAను తక్కువ అంచనా వేయొద్దని గిల్ సేన భావిస్తోంది. 9.30AMకు మ్యాచ్ మొదలుకానుంది. స్టార్ స్పోర్ట్స్, జియోహాట్ స్టార్లో లైవ్ చూడవచ్చు.
News November 14, 2025
బిహార్: ఓటింగ్ పెరిగితే ఫలితాలు తారుమారు!

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం భారీగా పెరిగిన ప్రతిసారీ అధికార పార్టీ కుర్చీ దిగిపోయిందని గత ఫలితాలు చెబుతున్నాయి. 1967లో దాదాపు 7% ఓటింగ్ పెరగగా అధికారంలోని INC కుప్పకూలింది. 1980లోనూ 6.8%, 1990లోనూ 5.7%శాతం పెరగగా అధికార మార్పిడి జరిగింది. ఇక తాజా ఎన్నికల్లోనూ 9.6% ఓటింగ్ పెరిగింది. మళ్లీ అదే ట్రెండ్ కొనసాగుతుందా లేక ప్రజలు NDAకే కుర్చీ కట్టబెడతారా అనేది ఈ మధ్యాహ్ననికి క్లారిటీ రానుంది.


