News November 18, 2024
ఆ స్టాక్‌లో 20% పతనం

Mamaearth పేరెంట్ కంపెనీ Honasa Consumer షేరు ధర సోమవారం 20% వరకు పతనమైంది. Q2 ఫలితాలు ఆశించిన దాని కంటే బలహీనంగా ఉండడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారు. దీంతో స్టాకు ధర లోయర్ సర్క్యూట్‌ను తాకి రూ.297 వద్ద ట్రేడ్ అవుతోంది. కొన్ని ఏజెన్సీలు సంస్థకు డౌన్‌గ్రేడ్ రేటింగ్ ఇచ్చాయి. Emkay Global ఏజెన్సీ Sell రేటింగ్ ఇచ్చి టార్గెట్ ప్రైస్‌ను ₹600 నుంచి ₹300కు తగ్గించింది.
Similar News
News December 7, 2025
టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు

టాటా, మారుతి సుజుకీ DECలో కార్లపై భారీ డిస్కౌంట్లు ఇస్తున్నాయి. మారుతి Invictoపై ₹2.15 లక్షల వరకు తగ్గింపు ప్రకటించింది. ₹లక్ష క్యాష్ డిస్కౌంట్, ₹1.15 లక్షల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ ఇవ్వనుంది. Fronxపై ₹88వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. హారియర్, సఫారీ SUVలపై ₹75 వేల వరకు క్యాష్ డిస్కౌంట్‌ను టాటా అందిస్తోంది. పాత మోడల్ తీసుకుంటే ₹లక్ష దాకా రాయితీ ఇవ్వనుంది. ఇతర మోడల్స్‌కూ ₹25K-55K డిస్కౌంట్స్ ఇస్తోంది.
News December 7, 2025
అక్కడ ఫ్లైట్లు ఎగరవు.. ఎందుకో తెలుసా?

టిబెట్ పీఠభూమిలో ఎత్తైన పర్వతాలు ఉండటంతో ఫ్లైట్లు నడపడం చాలా కష్టం. 2.5 మిలియన్ల చదరపు కి.మీ విస్తరించి ఉన్న ఆ పీఠభూమిలో సగటున 4,500 మీటర్ల ఎత్తైన పర్వతాలు ఉంటాయి. ఆక్సిజన్ లెవల్స్ తక్కువగా ఉండటంతో ఇంజిన్ పనితీరు తగ్గిపోతుంది. ఎమర్జెన్సీలో ఫ్లైట్ ల్యాండ్ చేయడానికి అక్కడ ఇతర విమానాశ్రయాలు ఉండవు. వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయి. వర్షాలు, భారీ ఈదురుగాలులు వీస్తాయి.
News December 7, 2025
పెరిగిన చికెన్ ధరలు

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు పెరిగాయి. హైదరాబాద్‌లో KG స్కిన్ లెస్ చికెన్ ధర ₹260గా ఉంది. వరంగల్, కామారెడ్డిలోనూ ఇవే రేట్లున్నాయి. విజయవాడ, గుంటూరు, విశాఖ, చిత్తూరులో ₹240-260, ఏలూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ₹220-230 వరకు పలుకుతోంది. ఇక మటన్ కేజీ ₹800-900 వరకు అమ్ముతున్నారు. కోడిగుడ్డు ధర రిటైల్‌లో ఒక్కోటి ₹7-9కి అమ్ముతున్నారు. మరి మీ ఏరియాలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయి?


