News July 10, 2025
టోకెన్లు లేని భక్తులకు 20 గంటల సమయం

AP: తిరుమల శ్రీవారి దర్శనం కోసం 29 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని వారికి సర్వదర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతోంది. నిన్న 76,501 మంది స్వామివారిని దర్శించుకోగా, 29,033 మంది తలనీలాలు సమర్పించారు. హుండీకి రూ.4.39 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ ప్రకటించింది.
Similar News
News July 10, 2025
విమాన ప్రమాదంపై వైరలవుతున్న లేఖ ఫేక్: PIB

అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రాథమిక నివేదిక అంటూ వైరలవుతున్న లేఖ ఫేక్ అని PIB ఫ్యాక్ట్ చెక్ ట్వీట్ చేసింది. ఆ నివేదికను ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో విడుదల చేయలేదని పేర్కొంది. సరైన సమాచారాన్ని అధికార వర్గాల ద్వారా వెల్లడిస్తామని తెలిపింది. గత నెల 12న జరిగిన విమాన ప్రమాదంలో 34 మంది స్థానికులతో కలిపి 275 మంది మరణించినట్లు గుజరాత్ ఆరోగ్యశాఖ ప్రకటించింది.
News July 10, 2025
పూర్తి కాలం నేనే సీఎం: సిద్దరామయ్య

కర్ణాటకకు తానే పూర్తికాలం ముఖ్యమంత్రిగా ఉంటానని సీఎం సిద్దరామయ్య ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. కర్ణాటకలో నాయకత్వ మార్పుకు కాంగ్రెస్ హైకమాండ్ ప్రయత్నాలు చేస్తోందన్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. డీకే శివకుమార్‌కు సీఎం అవ్వాలన్న ఆశ ఉండటంలో తప్పు లేదని సిద్దరామయ్య వ్యాఖ్యానించారు.
News July 10, 2025
అక్టోబర్ 31న బాహుబలి రీరిలీజ్

‘బాహుబలి’ సినిమాను అక్టోబర్ 31న రీరిలీజ్ చేయనున్నట్లు డైరెక్టర్ రాజమౌళి ప్రకటించారు. ఆ మూవీ విడుదలై నేటికి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ప్రకటన చేశారు. ‘బాహుబలి-1’, ‘బాహుబలి-2’లను కలిపి ‘బాహుబలి ఎపిక్’ పేరుతో ఒకేసారి రిలీజ్ చేస్తామని జక్కన్న ట్వీట్ చేశారు. నిడివి ఎక్కువ కాకుండా ఆ రెండు సినిమాల్లోని ముఖ్యమైన సన్నివేశాలతో రీరిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.