News May 24, 2024
శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం కంపార్టుమెంట్లన్నీ భక్తులతో నిండిపోగా శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 65,416 మంది భక్తులు దర్శించుకోగా.. 36,128 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.51 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
Similar News
News November 20, 2025
ఆవులతో డెయిరీఫామ్ ఎందుకు మేలంటే?

హోలిస్టిన్ ఫ్రీజియన్ జాతి ఆవులు ఒక ఈతకు 3000 నుంచి 3500 లీటర్ల పాలను ఇస్తాయి. వీటి పాలలో వెన్నశాతం 3.5-4% ఉంటుంది. జెర్సీ జాతి ఆవు ఒక ఈతకు 2500 లీటర్ల పాలనిస్తుంది. పాలలో వెన్నశాతం 4-5% ఉంటుంది. ఒక ఆవు ఏడాదికి ఒక దూడను ఇస్తూ.. మనం సరైన దాణా, జాగ్రత్తలు తీసుకుంటే 10 నెలలు కచ్చితంగా పాలిస్తుంది. ఒక ఆవు రోజుకు కనీసం 12-13 లీటర్లు పాలిస్తుంది కనుక పాడి రైతుకు ఏడాదిలో ఎక్కువ కాలం ఆదాయం వస్తుంది.
News November 20, 2025
తప్పుల సవరణకు ఈ ఒక్కరోజే ఛాన్స్!

TG: గ్రామ పంచాయతీలు, వార్డు ఓటరు జాబితాలో <<18333411>>తప్పులు<<>> ఉంటే సవరించుకునేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. పొరపాట్ల సవరణకు ఈ ఒక్కరోజు మాత్రమే ఓటర్ల నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. 22న జిల్లా పంచాయతీ అధికారులు వాటిని పరిశీలించి పరిష్కరిస్తారని SEC పేర్కొంది. 23న తుది ఓటరు జాబితాను ప్రచురిస్తారు. https://tsec.gov.in/లోకి వెళ్లి మీ పేరును చెక్ చేసుకొని తప్పులుంటే GPలో సంప్రదించాలి.
News November 20, 2025
ఇతిహాసాలు క్విజ్ – 72

ఈరోజు ప్రశ్న: కురుక్షేత్ర మహాసంగ్రామంలో అర్జునుడితో పోరాటం చేస్తున్నప్పుడు, కర్ణుడి రథ చక్రం నేలలో కూరుకుపోయింది. ఎంత ప్రయత్నించినా అది బయటకు రాలేదు. అందుకు కారణం ఏంటి?
☛ పై ప్రశ్నకు సమాధానాన్ని సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు జవాబు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>


