News January 6, 2025
ప్రతి ఆస్పత్రిలో 20 ఐసోలేషన్ బెడ్స్: మంత్రి సత్యకుమార్

AP: దేశంలో hMPV కేసులు నమోదవుతుండటంతో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రతి ఆస్పత్రిలో 20 ఐసోలేషన్ బెడ్స్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. ICMR అడ్వైజరీ మాత్రమే ఇచ్చిందని, ఎవరూ ఆందోళన చెందొద్దని సూచించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
Similar News
News January 7, 2026
డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకాలజికల్ రీసెర్చ్‌లో ఇంటర్న్‌షిప్

DRDOకు చెందిన డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకాలజికల్ రీసెర్చ్ 8 పెయిడ్ ఇంటర్న్‌షిప్‌ల కోసం దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు జనవరి 25 వరకు అప్లై చేసుకోవచ్చు. పీజీ(సైకాలజీ) ఫైనల్ ఇయర్, B.TECH/BE(CSE) ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు అర్హులు. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. నెలకు రూ.5వేలు చెల్లిస్తారు. వెబ్సైట్: https://www.drdo.gov.in
News January 7, 2026
మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో వెండి ధర భారీగా పెరిగింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.12,000 పెరిగి రూ.2,83,000కు చేరింది. మూడు రోజుల్లోనే రూ.26వేలు పెరగడం గమనార్హం. అటు 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఇవాళ రూ.660 పెరిగి రూ.1,39,480గా ఉంది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.600 ఎగబాకి రూ.1,27,850 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News January 7, 2026
ఢిల్లీ పొల్యూషన్.. రెండో రాజధానే సొల్యూషనా?

పొల్యూషన్‌కు పర్యాయపదంగా ఢిల్లీ మారిపోయింది. దీంతో ప్రజలు ఆరోగ్యపరంగా, ఆర్థికంగా చితికిపోతున్నారు. దేశ పరిపాలనా వ్యవహారాలకూ ఇబ్బంది కలుగుతోంది. హరియాణా, పంజాబ్‌లలో పంట వ్యర్థాల కాల్చివేతలతోపాటు లెక్కకుమించిన వాహనాలూ కాలుష్యానికి కారణమవుతున్నాయి. దీంతో దక్షిణాదిలో రెండో రాజధాని ఏర్పాటు వాదన బలపడుతోంది. దీనివల్ల ఢిల్లీపై ఒత్తిడి తగ్గుతుందంటున్నారు. మరి ఏ నగరం రెండో రాజధానికి అనుకూలం? కామెంట్


