News October 6, 2025
ఇంద్రకీలాద్రికి 20 లక్షల మంది భక్తులు

AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై గత 14 రోజుల్లో 20 లక్షల మంది దుర్గమ్మను దర్శించుకున్నట్లు ఆలయ ఈవో వీకే శీనానాయక్ తెలిపారు. గత నెల 22 నుంచి ఈ నెల 2 వరకు 15.90 లక్షల మంది, దసరా ఉత్సవాల అనంతరం 3, 4, 5 తేదీల్లో 4 లక్షల మందికి పైగా అమ్మవారి దర్శనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇవాళ్టి నుంచి ఘాట్ రోడ్డులోకి వాహనాలను అనుమతించనున్నట్లు తెలిపారు. ఆలయ హుండీలను నేటి నుంచి 3 రోజులపాటు లెక్కించనున్నారు.
Similar News
News October 6, 2025
త్వరలో సింగరేణి స్థలాల్లో పెట్రోల్ బంకులు!

TG: తమ సంస్థకు చెందిన ఖాళీ స్థలాల్లో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయాలని సింగరేణి నిర్ణయించింది. ఇందుకోసం IOCL, HPCL, BPCL సంస్థలతో ఒప్పందం చేసుకుంది. ఖాళీ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా వాటిని లీజుకు ఇవ్వాలని నిర్ణయించింది. ఖమ్మం(D) మణుగూరు, కొత్తగూడెంలోని ఆదివారం సంత, మంచిర్యాల(D) మందమర్రి, బెల్లంపల్లి, పెద్దపల్లి(D) రామగుండం ఏరియాల పరిధిలో మొత్తం 7 బంకులు నిర్మించేందుకు ప్రతిపాదించింది.
News October 6, 2025
రుక్మిణీ వసంత్ పేరెంట్స్ గురించి తెలుసా?

‘కాంతార ఛాప్టర్-1’తో హీరోయిన్ రుక్మిణీ వసంత్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారారు. ఆమె తండ్రి కల్నల్ వసంత్ వేణుగోపాల్ ఆర్మీ ఆఫీసర్. రుక్మిణీకి ఏడేళ్ల వయసు ఉన్నప్పుడే 2007లో పాక్ ఉగ్రవాదులతో ఎదురుకాల్పుల్లో మరణించారు. తల్లి సుభాషిణి భరతనాట్యం కళాకారిణి. భర్త మరణించాక తనలా సైన్యంలో భర్తలను కోల్పోయిన మహిళల కోసం ఫౌండేషన్ ఏర్పాటు చేసి సాయం చేస్తున్నారు. ప్రస్తుతం రుక్మిణీ NTR-నీల్ సినిమాలో నటిస్తున్నారు.
News October 6, 2025
ఫైల్స్ వికేంద్రీకరణ.. మొదలుపెట్టిన మంత్రి సత్య

AP ఆరోగ్యమంత్రి సత్యకుమార్ ఫైల్స్ వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టారు. నిర్ణయాలు, పనుల్లో వేగం పెంచేందుకు ప్రతి ఫైల్ తనకు చేరనవసరం లేదన్నారు. 28 అంశాల్లో తన శాఖ CS, తదితర ఉన్నతాధికారులకు డిసిషన్ పవర్ ఇచ్చారు. CM, కేబినెట్ నిర్ణయాలు, పాలసీలు, విజిలెన్స్ నివేదికలు, స్టాఫ్ సర్వీస్, విభజన అంశాలు, కేంద్రంతో సంప్రదింపులు, కాలేజీలు, హాస్పిటల్స్ ఏర్పాటు వంటి కీలక 17 విషయాల ఫైల్స్ తనకు పంపాలన్నారు.