News September 10, 2024

ప్రపంచంలోని 20 శాతం చెత్త భారత్‌లోనే

image

ప్రపంచంలోని ప్లాస్టిక్ చెత్తలో 20 శాతం భారత్‌దేనని ఓ సర్వే తెలిపింది. ఏటా 9.3 మిలియన్ల టన్నుల చెత్తను ఉత్పత్తి చేస్తోందని పేర్కొంది. భారత్ తర్వాత నైజీరియా (3.5 Mt), ఇండోనేషియా(3.4 Mt), చైనా(2.8 Mt), పాకిస్థాన్(2.6 Mt), బంగ్లాదేశ్(1.7 Mt), రష్యా(1.7 Mt), బ్రెజిల్(1.4 Mt), థాయిలాండ్(1 Mt) కాంగో (1 Mt) ఉన్నాయి. ఈ దేశాల్లో ప్లాస్టిక్‌ను రీసైక్లింగ్ చేసే వ్యవస్థలు లేకపోవడంతో చెత్త పెరుగుతోంది.

Similar News

News November 2, 2025

లండన్ పర్యటనలో CM చంద్రబాబు దంపతులు

image

AP: CM చంద్రబాబు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి లండన్‌ పర్యటనకు వెళ్లారు. ఈనెల 5 వరకు ఈ వ్యక్తిగత పర్యటన కొనసాగనుంది. ఈనెల 4న భువనేశ్వరి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డును అందుకోనున్నారు. గతంలో ఈ అవార్డును అబ్దుల్ కలాం, రాజశ్రీ బిర్లా అందుకున్నారు. హెరిటేజ్ ఫుడ్స్‌ తరఫున గోల్డెన్ పీకాక్ పురస్కారాన్నీ స్వీకరించనున్నారు. అనంతరం CM చంద్రబాబు పలువురు పారిశ్రామికవేత్తలను CII సదస్సుకు ఆహ్వానిస్తారు.

News November 2, 2025

తిరుమలలో ఘనంగా కైశిక ద్వాదశి ఆస్థానం

image

AP: తిరుమల శ్రీవారి ఆలయంలో కైశిక ద్వాదశి ఆస్థానం ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా ఉగ్ర శ్రీనివాసమూర్తి వాహన సేవను నిర్వహించనున్నారు. మలయప్పస్వామి శ్రీదేవీ, భూదేవీ సమేతంగా మాడ వీధుల్లో ఊరేగనున్నారు. ఈ వాహన సేవ ఉ.6-7.30 గంటల మధ్య జరగనుంది. ఏడాదికి ఒక్కసారి మాత్రమే జరిగే ఈ సేవను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు.

News November 2, 2025

శుభ కార్యాలు చేసేటప్పుడు పట్టు వస్త్రాలను ఎందుకు ధరించాలి?

image

శుభకార్యాలు చేసేటప్పుడు పట్టు వస్త్రాలు ధరించడానికి వెనుక శాస్త్రీయ కారణాలున్నాయి. సృష్టిలో ప్రతి ప్రాణి చుట్టూ ‘ఓరా’ అనే సప్తవర్ణ కాంతి పుంజం ఉంటుందట. పట్టు వస్త్రాలు ధరించినప్పుడు ఇది మరింత శక్తివంతంగా మారుతుందట. పట్టు వస్త్రాలు చుట్టూ ఉన్న ఈ సానుకూల శక్తిని ఆకర్షించి, మన శరీరమంతటా ప్రసరించేలా చేస్తుందట. అందుకే పెళ్లిళ్లు, పూజాది క్రతువులు, దేవాలయ దర్శనాల్లో పట్టు వస్త్రాలు ధరించడం ఆనవాయితీ.