News February 25, 2025
20 ప్రశ్నలు.. కిడ్నాప్‌తో సంబంధం లేదన్న వంశీ?

AP: వల్లభనేని వంశీని కస్టడీకి తీసుకున్న పోలీసులు తొలి రోజు రెండున్నర గంటలు విచారించారు. సత్యవర్ధన్ కిడ్నాప్‌నకు సంబంధించి 20 ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ఆ కేసుకు, తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. వంశీ రిమాండ్‌ను మరో 14 రోజులు పొడిగించిన కోర్టు 3 రోజులు పోలీస్ కస్టడీకి అనుమతించిన విషయం తెలిసిందే.
Similar News
News February 25, 2025
నైట్ బ్రషింగ్ చేయకపోతే ప్రమాదమే: అధ్యయనం

రాత్రుళ్లు బ్రష్ చేయడం ఎంతో మేలని వైద్యులు సూచిస్తున్నారు. కార్డియోవాస్కులర్ వ్యాధుల (CVD) ప్రమాదాన్ని నైట్ బ్రషింగ్ తగ్గిస్తుందని ఇటీవలి అధ్యయనంలో వెల్లడైంది. రాత్రిపూట బ్రషింగ్‌ను నిర్లక్ష్యం చేసిన వారితో పోలిస్తే, రోజుకు రెండు సార్లు పళ్లు తోముకునే వ్యక్తుల్లో CVDల సంభవం గణనీయంగా తగ్గినట్లు తేలింది. బ్రషింగ్ నిర్లక్ష్యం చేస్తే నోటి బ్యాక్టీరియా వృద్ధి చెంది గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది.
News February 25, 2025
బెయిల్ ఇవ్వాలని కోర్టులో వంశీ పిటిషన్

AP: తనకు బెయిల్ ఇవ్వాలంటూ వైసీపీ నేత వల్లభనేని వంశీ విజయవాడ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టును ఆశ్రయించారు. వంశీ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను కోర్టు ఆదేశించింది. కౌంటర్ పిటిషన్ వేసేందుకు మూడు రోజుల సమయం కావాలని పీపీ కోరగా, తదుపరి విచారణను కోర్టు ఈ నెల 28కి వాయిదా వేసింది.
News February 25, 2025
ఏడాదికి 2 సార్లు టెన్త్ ఎగ్జామ్స్: CBSE

సీబీఎస్ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 2026 నుంచి ఏడాదికి రెండుసార్లు టెన్త్ పరీక్షలు నిర్వహించనుంది. ఫిబ్రవరి 17-మార్చి 6 మధ్య తొలి దశ, మే 5-20 మధ్య రెండో దశ పరీక్షలు ఉండనున్నాయి. దీనికి సంబంధించిన ముసాయిదా నిబంధనలకు CBSE ఆమోదం తెలిపింది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఈ అంశంపై ఇప్పటికే ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది.