News May 17, 2024
20 నుంచి సబ్సిడీపై రైతులకు విత్తనాలు
AP: ఖరీఫ్ సీజన్ కోసం ఈ నెల 20 నుంచి సబ్సిడీపై విత్తనాలను పంపిణీ చేయనున్నారు. 6.19 లక్షల క్వింటాళ్ల విత్తనాల్ని సిద్ధం చేశారు. ఇందుకు రూ.450 కోట్లు ఖర్చు చేస్తున్న GOVT రూ.195 కోట్ల సబ్సిడీ భరించనుంది. పచ్చిరొట్ట, చిరుధాన్యాల విత్తనాలపై 50%, వేరుశనగపై 40% సబ్సిడీ ఇవ్వనుంది. NFSM పరిధిలోని జిల్లాల్లో వరి విత్తనాలు క్వింటాలుకి రూ.1000, మిషన్ పరిధిలో లేని జిల్లాల్లో రూ.500 చొప్పున సబ్సిడీ ఇస్తారు.
Similar News
News January 11, 2025
గాయంతో హీరోయిన్ రష్మిక(PHOTOS)
జిమ్‌లో గాయపడ్డ హీరోయిన్ రష్మిక తాజా ఫొటోలను పంచుకున్నారు. ‘కోలుకునేందుకు రోజులు, నెలలు పడుతుందో దేవుడికే తెలియాలి. త్వరలోనే సికందర్, కుబేర సెట్స్‌లోకి అడుగుపెడతానని ఆశిస్తున్నా. ఆలస్యానికి నా దర్శకులకు క్షమాపణలు. త్వరగా తిరిగొచ్చి యాక్షన్ సీన్లు చేయడానికి ప్రయత్నిస్తాను. ఈలోగా అవసరమైతే ఏదో ఒక మూలన కూర్చొని అడ్వాన్స్ పనులు చేస్తాను’ అని ఆమె పోస్ట్ పెట్టారు.
News January 11, 2025
విద్యార్థులకు శుభవార్త: లోకేశ్
AP: సంక్రాంతి పండుగ వేళ విద్యార్థులకు CM చంద్రబాబు శుభవార్త అందించారని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. ‘కంసమామ మోసం చేసి పోతే చంద్రన్న న్యాయం చేస్తున్నారు. జగన్ బకాయిలు పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులను విడుదల చేస్తున్నారు. గత పాలకుల పాపాలకు విద్యార్థులు బలి కాకూడదని నేను మంత్రి అయ్యాక విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇచ్చే ఏర్పాట్లు చేశాం. రూ.788 కోట్లు చెల్లిస్తున్నాం’ అని లోకేశ్ Xలో ట్వీట్ చేశారు.
News January 11, 2025
భారత్-ఇంగ్లండ్ T20 సిరీస్ షెడ్యూల్
☛ జనవరి 22- తొలి T20- కోల్‌కతా
☛ జనవరి 25- రెండో T20- చెన్నై
☛ జనవరి 28- మూడో T20- రాజ్‌కోట్
☛ జనవరి 31- 4వ T20- పుణే
☛ ఫిబ్రవరి 2- ఐదో T20- ముంబై
☛ ☛ అన్ని <<15128809>>మ్యాచ్‌లు <<>>రాత్రి 7 గంటల నుంచి ప్రారంభం అవుతాయి.