News April 4, 2024
AI సిటీకి 200 ఎకరాలు: మంత్రి శ్రీధర్‌బాబు

TG: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో విస్తృత పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తామని ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. సైబర్ టవర్స్‌లో టెక్ హబ్‌ను ప్రారంభించిన తర్వాత మాట్లాడుతూ.. ‘త్వరలో AI సిటీ కోసం 200 ఎకరాలు కేటాయిస్తాం. స్కిల్ వర్సిటీ ఏర్పాటు చేసి ఐటీ ఇండస్ట్రీ అవసరాలు తీరుస్తాం. హైదరాబాద్ వేదికగా జులైలో AIపై సదస్సు నిర్వహిస్తాం’ అని తెలిపారు.
Similar News
News October 18, 2025
అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు మరో అవకాశం

AP: అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు మరో అవకాశమివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు యాక్ట్‌ను సవరిస్తూ <
News October 18, 2025
ఇతిహాసాలు క్విజ్ – 39 సమాధానాలు

1. క్షీరసాగర మథనం సమయంలో అమృతంతో ఉద్భవించిన దేవతల వైద్యుడు ధన్వంతరి.
2. జమదగ్ని మహర్షి కుమారుడిగా పుట్టిన విష్ణు అవతారం ‘పరుశరాముడు’.
3. కాలానికి, వినాశనానికి దేవతగా కాళీ మాతను పరిగణిస్తారు.
4. క్షీరసాగర సమయంలో మొదట కాలకూట విషం వచ్చింది.
5. ఇంద్రుడి రాజధాని ‘అమరావతి’. <<-se>>#Ithihasaluquiz<<>>
News October 18, 2025
పెళ్లి చేసుకున్న ‘దంగల్’ నటి

‘దంగల్’ సినిమా ఫేమ్ జైరా వసీమ్ పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తన భర్త ఫేస్‌ను రివీల్ చేయకుండా ఓ ఫొటోను షేర్ చేశారు. ‘దంగల్’ మూవీలో నటనకుగాను నేషనల్ అవార్డు అందుకున్న ఆమె బాలీవుడ్లో ‘సీక్రెట్ సూపర్ స్టార్, ది స్కై ఈజ్ పింక్’ వంటి సినిమాల్లో నటించారు. మత విశ్వాసాల కారణంగా 2019లో ఫిల్మ్ ఇండస్ట్రీకి దూరమయ్యారు. తాజాగా పెళ్లి వార్తతో ఫ్యాన్స్‌ను సర్ప్రైజ్ చేశారు.