News July 5, 2024
తెలంగాణకు కొత్తగా 200 ఇంజినీరింగ్ కాలేజీలు

TG: తెలంగాణలో కొత్తగా మరో 200 ఇంజినీరింగ్ కళాశాలలు రానున్నాయి. ఈ మేరకు AICTE అనుమతులు జారీ చేసింది. వీటిలో ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలతో పాటు 10 డీమ్డ్ వర్సిటీలు, వాటి క్యాంపస్‌లు ఉన్నాయి. సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లోని కోస్గిలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో 3 బ్రాంచీల్లో బీటెక్ ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది.
Similar News
News April 1, 2026
కుప్పకూలిన విమానం.. 29 మంది మృతి

రష్యా సైనిక రవాణా విమానం కుప్పకూలింది. ఈస్ట్ యూరప్‌లోని క్రిమియాలో ఓ కొండను ఫ్లైట్ ఢీకొట్టిన ఘటనలో 29 మంది చనిపోయారు. మృతుల్లో ఆరుగురు సిబ్బంది, 23 మంది ప్రయాణికులు ఉన్నారు. సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 1, 2026
అకౌంట్‌లో ₹44, చేతిలో ₹40.. బరిలో 26ఏళ్ల అమ్మాయి!

కేరళంలోని ఎట్టుమనూర్‌లో ఆశ్నా థంపి అనే 26ఏళ్ల జర్నలిస్ట్ ఎన్నికల బరిలోకి దిగడం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. తనకు ఆస్తులేం లేవని.. ₹40 క్యాష్, బ్యాంక్ అకౌంట్‌లో ₹44 ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొనడమే ఇందుకు కారణం. SUCI(C) పార్టీ నుంచి పోటీ చేస్తున్న ఆమె కేరళం ఎన్నికల బరిలో ఉన్న అత్యంత పేద అభ్యర్థిగా నిలిచారు. ప్రజాస్వామ్యంలో డబ్బు కంటే ప్రజల సమస్యలే ముఖ్యమని ఆశ్నా చెబుతున్నారు. <<-se>>#Elections2026<<>>
News April 1, 2026
‘ఏప్రిల్ ఫూల్’ ఎలా వచ్చిందంటే?

ఏటా ఏప్రిల్ 1న ఒకరినొకరు ఆటపట్టించుకుంటూ ఫూల్స్ చేయడం చూస్తుంటాం. అయితే దీని వెనుక ఓ ఆసక్తికరమైన రూమర్ ఉంది. 1582లో ఫ్రాన్స్ తన క్యాలెండర్‌ను మార్చినప్పుడు కొత్త సంవత్సరం జనవరి 1న ప్రారంభమవుతుందని ప్రకటించింది. అయితే ఈ మార్పు తెలియక APR 1నే వేడుకలు చేసుకున్న వారిని అందరూ ‘ఫూల్స్’ అని పిలవడం మొదలుపెట్టారు. అలా ఈ ఏప్రిల్ ఫూల్ ప్రారంభమైందట. ఏదో ఒక సమయంలో మీరూ ఏప్రిల్ ఫూల్ అయ్యే ఉంటారు కదూ. COMMENT


