News February 2, 2025

3 ఏళ్లలో 200 కొత్త వందేభారత్ రైళ్లు: అశ్వినీ వైష్ణవ్

image

2025-26లో 2వేల జనరల్ కోచ్‌ల తయారీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ ఏడాది 100% ఎలక్ట్రిఫికేషన్ పూర్తిచేస్తామని చెప్పారు. మూడేళ్లలో 200 కొత్త వందేభారత్ రైళ్లు, 100 అమృత్ భారత్, 50 నమో భారత్ ర్యాపిడ్ రైళ్లు, 17,500 జనరల్, నాన్ ఏసీ కోచ్‌లు అందుబాటులోకి వస్తాయన్నారు. కొత్త లైన్లు, డబ్లింగ్, ఫ్లైఓవర్, అండర్‌పాస్‌ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.

Similar News

News February 2, 2025

16 మంది ఎంపీలున్న చంద్రబాబు ఏం సాధించారు?: బుగ్గన

image

కేంద్ర బడ్జెట్‌లో APకి నిధులు రాబట్టడంతో CM చంద్రబాబు విఫలమయ్యారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విమర్శించారు. 12 మంది MPలతోనే బిహార్ CM నితీశ్ అధిక నిధులు సాధించారని, 16 మంది MPలున్నప్పటికీ CBN అసమర్థుడిగా మిగిలారని మండిపడ్డారు. ‘పోలవరం ప్రాజెక్టును 41.15 మీటర్ల ఎత్తుకే పరిమితం చేశారు. నిర్మాణంలో ఉన్న పోర్టులకు నిధులు కోరలేదు. మెడికల్ కాలేజీల విషయంలోనూ నిర్లక్ష్యం వహించారు’ అని దుయ్యబట్టారు.

News February 2, 2025

రేటింగ్ కోసం లంచాలు.. KL యూనివర్సిటీపై కేసు

image

AP: గుంటూరు జిల్లాలోని KL యూనివర్సిటీపై CBI కేసు నమోదు చేసింది. NAAC రేటింగ్స్ కోసం లంచాలు ఇచ్చినట్లు ఆరోపణలు రావడంతో దేశ వ్యాప్తంగా 20 చోట్ల విద్యాసంస్థల్లో సోదాలు చేపట్టి యూనివర్సిటీ ఉద్యోగులు, NAAC సిబ్బందిని అదుపులోకి తీసుకుంది. నగదు, బంగారం, సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల రూపంలో లంచాలు ఇచ్చినట్లు గుర్తించింది. రూ.37 లక్షల నగదు, 6 ల్యాప్‌టాప్‌లు, ఫోన్లు, పలు డాక్యుమెంట్లను CBI స్వాధీనం చేసుకుంది.

News February 2, 2025

సుమతీ నీతి పద్యం- తాత్పర్యం

image

అడిగిన జీతం బియ్యని
మిడిమేలపు దొరను గొల్చి మిడుకుటకంటెన్
వడిగల యెద్దలగట్టుక
మడి దున్నుకబ్రతుకవచ్చు మహిలో సుమతీ!
తాత్పర్యం: అడిగిన జీతం ఇవ్వని గర్వంతో కూడిన యజమాని వద్ద ఉండటం కంటే వేగంగా పోయే ఎద్దులను నాగలికి కట్టుకుని వ్యవసాయం చేయడం మంచిది.