News July 23, 2024

5 రోజుల్లో 200 టీఎంసీలు సముద్రం పాలు!

image

ఈ నెల 17 నుంచి 22 సాయంత్రం వరకు 5 రోజుల్లో 200 టీఎంసీల గోదావరి నీళ్లు వృథాగా సముద్రంలోకి వెళ్లిపోయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కొన్ని రోజులుగా ప్రాణహిత, ఇంద్రావతి, కిన్నెరసాని, శబరి నదులకు వరద పోటెత్తుతోంది. ఈ నీటిని ఒడిసిపట్టే పరిస్థితి లేకపోవడంతో ఆ వరద అంతా సముద్రం పాలవుతోంది. మరోవైపు ప్రధాన గోదావరిపై ఉన్న శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి ప్రాజెక్టులకు స్వల్ప వరద ప్రవాహం వస్తోంది.

Similar News

News January 21, 2026

కివీస్ జోరుకు సూర్య కళ్లెం వేస్తారా?

image

నాగ్‌పూర్ వేదికగా ఇవాళ టీమ్ ఇండియా-NZ మధ్య తొలి టీ20 జరగనుంది. ఇప్పటికే ODI సిరీస్ గెలిచి కివీస్ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. స్టాట్స్ ప్రకారం ఇరు దేశాల మధ్య 8 ద్వైపాక్షిక T20 సిరీస్‌లు జరగ్గా భారత్ 5, NZ 3 గెలిచాయి. అయితే సూర్య ఫామ్ కాస్త ఆందోళన కలిగిస్తోంది. అభిషేక్, శాంసన్, ఇషాన్ మంచి స్టార్ట్ ఇస్తే గెలుపు సాధ్యమే. రా.7గం. నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో మ్యాచ్ లైవ్ చూడొచ్చు.

News January 21, 2026

పురుగు మందుల కొనుగోలు- జాగ్రత్తలు

image

పంటకు ఆశించినది తెగులో, పురుగో గుర్తించి.. వ్యవసాయ అధికారుల సిఫార్సు మేరకు నమ్మకమైన డీలర్ల నుంచి పురుగు మందులను కొనాలి. డీలర్ నుంచి మందు వివరాల రసీదును తప్పనిసరిగా తీసుకోవాలి. 2,3 రకాల మందులు అందుబాటులో ఉంటే విషపూరిత గుణాన్ని బట్టి తక్కువ హాని కలిగించే మందును ఎన్నుకోవాలి. ప్యాకెట్‌పై ఆ మందును ఏ పంటలో ఏ పురుగు, తెగులు కోసం సిఫార్సు చేశారో చూసి తీసుకోవాలి. ప్యాకింగ్, గడువు తేదీని తప్పక చూడాలి.

News January 21, 2026

రూ. లక్ష జీతంతో సుప్రీంకోర్టులో ఉద్యోగాలు

image

<>సుప్రీంకోర్టు <<>>90 లా క్లర్క్ కమ్ రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. LLB, ఇంటిగ్రేటెడ్ లా డిగ్రీతో పాటు బార్ కౌన్సిల్‌లో అడ్వకేట్‌గా ఎన్‌రోల్ అయినవారు FEB 7 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 20- 32 ఏళ్ల మధ్య ఉండాలి. మల్టీపుల్ ఛాయిస్, కాంప్రహెన్షన్ స్కిల్స్ టెస్ట్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.లక్ష జీతం చెల్లిస్తారు. సైట్: https://www.sci.gov.in/