News March 28, 2025
2000 మంది పోలీసులతో భారీ బందోబస్తు

ఉగాది ఉత్సవాల సందర్భంగా శ్రీశైలంలో 800 సీసీ కెమెరాలు, 3 డ్రోన్లతో పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా పర్యవేక్షణలో ఆరుగురు DSPలు, 40 మంది సీఐలు, 100 మంది ఎస్ఐలు, 1,500 సీవిల్ పోలీస్ సిబ్బంది, 200 మంది ఆర్మ్డ్, 200 మంది APSP, 100 మంది స్పెషల్ పార్టీ మొత్తంగా 2 వేలకు పైగా సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ASP చంద్రబాబు, DSP రామాంజీ నాయక్, CI ప్రసాదరావు ఉన్నారు.
Similar News
News November 23, 2025
భద్రాద్రి జిల్లాలో శనివారం ముఖ్యాంశాలు

✓భద్రాద్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా తోట దేవి ప్రసన్న
✓దమ్మపేట: అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 3 లారీలు సీజ్
✓కొత్తగూడెం 2టౌన్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన డీఎస్పీ
✓కొత్తగూడెం: ఎన్కౌంటర్ బూటకమే: CPIML మధు
✓అనుమానిత వాహనాలు తనిఖీ చేసిన ఇల్లందు పోలీసులు
✓భద్రాచలం: ఇసుక లారీలతో ప్రజల ఇబ్బందులు
✓కొత్తగూడెం: 4 లేబర్ కోడ్ రద్దు చేయాలి: TUCI
✓సింగరేణిలో 1258 మంది ఉద్యోగులు పర్మినెంట్
News November 23, 2025
కుజ దోషం తొలగిపోవాలంటే?

కుజ దోష ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ‘ఓం అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహీ.. తన్నో అంగారక ప్రచోదయాత్’ అనే గాయత్రి మంత్రాన్ని పఠించాలని జ్యోతిష నిపుణులు సూచిస్తున్నారు. క్రమం తప్పకుండా హనుమాన్ చాలీసా పఠించాలని చెబుతున్నారు. సమీపంలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో మంగళవారం రోజున దాన ధర్మాలు చేయడం, హనుమంతుడిని పూజించడం ఎంతో మంచిదని అంటున్నారు.
News November 23, 2025
NZB: సాధారణ కార్యకర్త నుంచి DCC అధ్యక్షుడిగా..!

నిజామాబాద్ DCC అధ్యక్షుడిగా నగేష్ రెడ్డి నియమితులయ్యారు. మోపాల్(M) ముల్లంగికి చెందిన చెందిన ఆయన 1986లో TDPనుంచి సర్పంచ్గా పని చేశారు. 1995లో కాంగ్రెస్లో చేరి 2004వరకు మోపాల్ సింగిల్ విండో ఛైర్మన్గా, 2014 వరకు 5 సార్లు మార్కెట్ కమిటీ ఛైర్మన్గా చేశారు. కాంగ్రెస్ పార్టీలో సాధారణ కార్యకర్త నుంచి అంచలంచెలుగా ఎదిగారు. 2023లో MLA టికెట్ ఆశించగా పార్టీ భూపతి రెడ్డికి టికెట్ ఖరారు చేసింది.


