News June 3, 2024
ప్రజల వద్ద రూ.7,755 కోట్ల విలువైన 2వేల నోట్లు: RBI

ఇప్పటికీ ప్రజల వద్ద రూ.7,755 కోట్ల విలువైన రూ.రెండు వేల నోట్లు ఉన్నాయని RBI వెల్లడించింది. గత ఏడాది మే 19న రూ.2 వేల నోట్ల సర్క్యులేషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించగా.. ఇప్పటిదాకా 97.82 శాతం నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చాయని పేర్కొంది. ఇప్పటికీ కొందరు పోస్ట్ ద్వారా నోట్లను పంపుతున్నట్లు తెలిపింది. 2016లో పాత రూ.1,000, 500 నోట్లను రద్దు చేసి రూ.2వేల నోట్లను RBI తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
Similar News
News October 22, 2025
రేపటి మ్యాచ్‌కు వర్షం ముప్పుందా?

రేపు భారత్-ఆస్ట్రేలియా రెండో వన్డే జరిగే అడిలైడ్‌లో వర్షం ముప్పు 20% ఉందని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. అయితే మ్యాచ్‌కు అంతరాయం కలిగించకపోవచ్చని పేర్కొంది. దీంతో 50 ఓవర్ల ఆట జరగనుంది. ఇక తొలి వన్డేకు వర్షం పదేపదే అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 26 ఓవర్లకు కుదించారు. ఇందులో AUS 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సిరీస్‌లో నిలవాలంటే రేపటి మ్యాచులో తప్పక గెలవాలి.
News October 22, 2025
నెట్వర్క్ ఆస్పత్రులకు రూ.250 కోట్లు విడుదల

AP: ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ ఆస్పత్రుల బకాయిల్లో రూ.250 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. మరో రూ.250కోట్లు త్వరలోనే రిలీజ్ చేస్తామంది. ఈ క్రమంలో నెట్వర్క్ ఆస్పత్రులు వెంటనే సమ్మె విరమించాలని విన్నవించింది. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌తో వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ భేటీ అయి నిధుల గురించి చర్చించారు. ఈ సందర్భంగా రూ.250CR విడుదలకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని పయ్యావుల వివరించారు.
News October 22, 2025
సర్ఫరాజ్ ఇంకా ఏం నిరూపించుకోవాలి: అశ్విన్

సర్ఫరాజ్ ఖాన్‌ను ఇండియా-ఏ జట్టుకు ఎంపిక చేయకపోవడంపై మాజీ ప్లేయర్ అశ్విన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘అతడు ఇంకా ఏం నిరూపించుకోవాలి? బరువు తగ్గాడు. భారీగా పరుగులు చేశాడు. గతేడాది న్యూజిలాండ్‌తో టెస్టులో సెంచరీ కూడా బాదాడు. కానీ అప్పటి నుంచి సీనియర్ టీమ్‌లో కాదు కదా A జట్టులో కూడా చోటు దక్కకపోతే ఎలా? ఇక అతడి అవసరం లేదేమో.. సర్ఫరాజ్‌కు డోర్లు దాదాపు మూసుకుపోయినట్లే’ అని వ్యాఖ్యానించారు.