News April 15, 2025
టీటీడీలో 2 వేల మంది మా వాళ్లే: భూమన

AP: టీటీడీలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 2 వేల మంది తమవారేనని YCP నేత, TTD మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. టీటీడీలో జరిగే పరిణామాలపై వారు ఎప్పటికప్పుడు తమకు సమాచారం ఇస్తూనే ఉంటారని చెప్పారు. ‘గోశాలలో ఆవుల మృతిపై నేను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటా. నేను విడుదల చేసిన ఫొటోలు తప్పని తేలితే నాపై చర్యలు తీసుకోవచ్చు. నిజమైతే టీటీడీ ఈఓ, ఛైర్మన్‌ను తొలగించాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.
Similar News
News April 16, 2025
రేపు ఫలితాలు విడుదల

జేఈఈ మెయిన్స్ ఫలితాలను NTA రేపు విడుదల చేయనుంది. B.E, B.Techలో ప్రవేశాల కోసం పరీక్ష రాసిన విద్యార్థులు అన్సర్ కీతో పాటు ఫలితాలను రేపు తెలుసుకోవచ్చు. ఇందుకోసం విద్యార్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కాగా ఏప్రిల్ 2,3,4,7,8 తేదీల్లో B.E, B.Tech ప్రవేశాల కోసం, ఏప్రిల్ 9న బీఆర్కే, బీప్లాన్ ఎంట్రన్స్ కోసం పరీక్షలు నిర్వహించారు.
వెబ్సైట్: <
News April 16, 2025
కునాల్ కమ్రాకు బాంబే హైకోర్టు ఊరట

మహారాష్ట్ర Dy.CM శిండేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కమెడియన్ కునాల్ కమ్రాను పోలీసులు వెంటాడుతున్న సంగతి తెలిసిందే. దీంతో తనను అరెస్టు చేయొద్దని కోరుతూ బాంబే హైకోర్టును కమ్రా ఆశ్రయించగా కోర్టు తాత్కాలికంగా ఊరటనిచ్చింది. తీర్పును రిజర్వ్ చేశామని, అప్పటి వరకు కునాల్‌ను అరెస్ట్ చేయొద్దని పోలీసుల్ని ఆదేశించింది.
News April 16, 2025
మరోసారి నిరాశపరిచిన ‘మెక్‌గర్క్’

ఢిల్లీ బ్యాటర్ మెక్‌గర్క్ మరోసారి నిరాశపరిచారు. రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచులో రెండు ఫోర్లు కొట్టి ఊపు మీదున్నట్లు కనిపించినా 9 పరుగులకే ఔటయ్యారు. ఈ సీజన్లో 6 ఇన్నింగ్సుల్లో 55 పరుగులే చేశారు. ఇందులో అత్యధికం 38 రన్స్. గత ఏడాది 9 ఇన్నింగ్సుల్లో 330 పరుగులు చేసిన ఈ హిట్టర్ ఈ సారి తేలిపోతున్నారు. మరి తర్వాతి మ్యాచుల్లోనైనా ఫామ్ అందుకొని ఢిల్లీకి శుభారంభం అందిస్తారో లేదో వేచిచూడాలి.