News September 9, 2024

ఒక్కరిని అరెస్ట్ చేసేందుకు 2,000 మంది పోలీసులు

image

ఫిలిప్పీన్స్‌లో అపోలో అనే పాస్టర్ దావోవ్ సిటీలో 75ఎకరాల్లో ది కింగ్‌డమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ పేరిట ఓ సామ్రాజ్యం స్థాపించారు. సెక్స్ రాకెట్, డ్రగ్స్ స్మగ్లింగ్‌తో పాటు వ్యక్తిగత సహాయకులనూ లైంగికంగా వేధించారని అభియోగాలున్నాయి. దీంతో దాదాపు 2వారాల ఆపరేషన్ తర్వాత ఆ సామ్రాజ్యంలోకి ప్రవేశించిన 2,000 మంది పోలీసులు ఓ బంకర్‌లో దాక్కొన్న అపోలోను అరెస్ట్ చేశారు. హెలికాప్టర్లను కూడా వాడారు.

Similar News

News February 4, 2026

ఇవాళ చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ

image

AP: సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. ఇవాళ ఉదయం 10.40 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఇద్దరు నేతల భేటీ కొనసాగనుంది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలతో పాటు త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల ఎంపిక, ఇతర కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

News February 4, 2026

క్రికెట్‌లో మార్పు.. ఆఖరి ఓవర్‌లో అవుటైనా..

image

క్రికెట్ రూల్స్ నిర్ణయించే MCC మరో కీలక మార్పు చేసింది. టెస్టుల్లో ఇంతకుముందు రోజులో చివరి ఓవర్‌లో ఏదైనా బంతికి బ్యాటర్ అవుటైతే అక్కడే ఆ రోజు ఆట ఆపివేసేవారు. మిగతా బంతులను బౌలర్ తర్వాతి రోజు వేసేవారు. తాజాగా MCC దాన్ని సవరించింది. బ్యాటర్ అవుటైనా ఆఖరి ఓవర్ పూర్తి చేస్తేనే ఆ రోజు ఆట ముగుస్తుందని తెలిపింది. వికెట్ పడగానే మ్యాచ్‌ను ఆపడం వల్ల ఆటలో డ్రామాను కోల్పోతున్నామని పేర్కొంది.

News February 4, 2026

వరిలో పాముపొడ(మాగుడు) తెగులు – నివారణ

image

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గాలిలో తేమ వల్ల వరిలో పాముపొడ తెగులు ఉద్ధృతి పెరిగే అవకాశం ఉంది. వరి దుబ్బు చేసే దశలో ఇది వ్యాపిస్తుంది. వరి కాండం, ఆకులపై పాము పొడ లాంటి మచ్చలు కనిపిస్తాయి. తెగులు తీవ్రమైతే మొక్కలు ఎండి, తాలు గింజలు ఏర్పడతాయి. దీని నివారణకు ఎకరానికి 200 లీటర్ల నీటిలో 400ml హెక్సాకొనజోల్ 5 SP లేదా 400ml వాలిడామైసిన్ 3 SL లేదా 200ml ప్రోపికొనజోల్ 25% EC కలిపి పిచికారీ చేయాలి.