News August 7, 2024

KL రాహుల్‌కు 200వ మ్యాచ్

image

టీమ్ ఇండియా మిడిలార్డర్ బ్యాటర్ KL రాహుల్ ఇవాళ తన 200వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడనున్నారు. నేడు శ్రీలంకతో జరిగే మూడో వన్డేలో ఆయన ఈ ఘనత సాధించనున్నారు. ఇప్పటివరకు 199 మ్యాచ్‌లు ఆడి 7,979 రన్స్ చేశారు. మరో 21 పరుగులు చేస్తే 8,000 పరుగుల క్లబ్‌లోకి చేరుకుంటారు. కాగా కొన్నేళ్లుగా టీమ్ ఇండియాకు రాహుల్ వెన్నెముకగా మారారు. మిడిలార్డర్‌లో పలు కీలక ఇన్నింగ్స్‌లు ఆడి భారత విజయాల్లో తన వంతు పాత్ర పోషిస్తున్నారు.

Similar News

News November 23, 2025

ఉమ్మడి పాలమూరు జిల్లా డీసీసీ అధ్యక్షులు వీరే..!

image

కాంగ్రెస్ అధిష్ఠానం ఎట్టకేలకు జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులను నియమించింది. కాంగ్రెస్ మొత్తం 36 మందిని డీసీసీ అధ్యక్షులుగా నియమాకం చేపట్టింది.
1.మహబూబ్‌నగర్‌- సంజీవ్ ముదిరాజ్
2.నాగర్‌కర్నూల్‌- చిక్కుడు వంశీకృష్ణ
3.వనపర్తి- కె.శివసేనారెడ్డి
4.జోగుళాంబ గద్వాల్-రాజీవ్ రెడ్డి
5.నారాయణపేట- కె.ప్రశాంత్ కుమార్ రెడ్డి.
# SHARE IT

News November 23, 2025

కుజ దోషం తొలగిపోవాలంటే?

image

కుజ దోష ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ‘ఓం అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహీ.. తన్నో అంగారక ప్రచోదయాత్’ అనే గాయత్రి మంత్రాన్ని పఠించాలని జ్యోతిష నిపుణులు సూచిస్తున్నారు. క్రమం తప్పకుండా హనుమాన్ చాలీసా పఠించాలని చెబుతున్నారు. సమీపంలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో మంగళవారం రోజున దాన ధర్మాలు చేయడం, హనుమంతుడిని పూజించడం ఎంతో మంచిదని అంటున్నారు.

News November 23, 2025

కేజీ రూపాయి.. డజను రూ.60!

image

AP: మూడేళ్లుగా టన్ను <<18336571>>అరటి<<>> రూ.25వేలు పలకగా ఈసారి రూ.1,000లోపు పడిపోవడంతో రాయలసీమ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కేజీకి రూపాయి మాత్రమే వస్తోంది. కిలోకి 6, 7 కాయలు వస్తాయి. 2 కేజీలు అంటే డజను. బయట మార్కెట్లో వ్యాపారులు డజను అరటి రూ.40-60కి అమ్ముతున్నారు. ఈ లెక్కన రైతుకు రూ.2 మాత్రమే వస్తున్నాయంటే వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. లోపం ఎక్కడ ఉంది? COMMENT.