News January 13, 2025

2018లోనే గ్రీన్‌కో ప్రాజెక్ట్‌కు ఆమోదం: TG

image

పిన్నాపురం గ్రీన్‌కో ప్రాజెక్టును జగన్ ప్రారంభించారని YCP నేతలు పేర్కొన్నారు. దీనిపై మంత్రి TG భరత్ స్పందించారు. ‘2018లోనే TDP ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌‌కు ఆమోదం తెలిపింది. ఇంత పెద్ద ప్రాజెక్ట్ రావడానికి జగన్ కృషే కారణమని కొందరు చెప్పడం నాకు ఆశ్చర్యంగా ఉంది. నిజానికి జగన్ తన పదవీ కాలంలో కొన్నేళ్ల పాటు ఈ ప్రాజెక్టును నిలిపివేశారు. ఇకనైనా ప్రజలను తప్పుదారి పట్టించడం మానేయాండి’ అని మంత్రి అన్నారు.

Similar News

News January 13, 2025

ఆళ్లగడ్డ సచివాలయ ఉద్యోగికి డాక్టరేట్

image

ఆళ్లగడ్డలో వార్డు సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న చాగలమర్రికి చెందిన డా.మౌలాలి డాక్టరేట్ పొందారు. అర్థశాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్.గణేశ్ నాయక్ పర్యవేక్షణలో ‘ఏ స్టడీ ఆఫ్ లేబర్ వెల్ఫేర్ ప్రాక్టీసెస్ ఇన్ సెలెక్టెడ్ ఇండస్ట్రీస్ ఆఫ్ కర్నూల్ డిస్త్రీక్ట్’ అనే అంశంపై పరిశోధన చేశారు. వైవీయూ పరీక్షల నిర్వహణ అధికారి ఆచార్య కేఎస్‌వీ కృష్ణారావు డాక్టరేట్‌ను జారీ చేశారు.

News January 13, 2025

నేర ప్రవృత్తికి స్వస్తి పలికి.. మంచి పౌరులుగా జీవించాలి: ఎస్పీ

image

రౌడీ షీటర్లు, నేరచరిత్ర గలవారు, చెడు నడత కలిగిన వ్యక్తులు సత్ప్రవర్తనతో జీవించాలని జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా హెచ్చరించారు. నేర ప్రవృత్తికి స్వస్తి చెప్పి మంచి పౌరులుగా జీవించాలన్నారు. ఆదివారం జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో కౌన్సిలింగ్ నిర్వహించారు. అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొనరాదని, రౌడీ షీటర్లపై నిరంతరం నిఘా ఉంటుందని తెలిపారు.

News January 13, 2025

భోగి మంట వేస్తున్నారా?

image

సంక్రాంతి వేడుకలో మొదటి రోజు భోగి. తెల్లవారుజామున భోగి మంటలు వేయడంతో పండుగ సెలబ్రేషన్స్‌ మొదలవుతాయి. ఇంటింటా ఉత్సాహంగా భోగి మంటలు వేసుకుంటారు. మరి నేడు మీరూ భోగి మంట వేస్తున్నారా? మీసెలబ్రేషన్స్‌‌ను వే2న్యూస్‌లో చూడాలనుకుంటున్నారా? అయితే మీ భోగి మంటను వీడియో తీసి ఈ 97036 22022కు వాట్సాప్ చేయండి. మీ గ్రామం, మండలం పేర్లు పంపండి. మేము పబ్లిష్ చేస్తాం.