News June 3, 2024
2019 ఎగ్జిట్ పోల్స్: ఇండియా టుడే ఏం చెప్పిందంటే?

తాజాగా India Today Axis My India వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్లో ఏపీలో <<13363723>>కూటమి<<>> ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అంచనా వేసింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి 37-40, వైసీపీకి 130-135, జనసేనకు 0-1 వస్తాయని ఈ సంస్థ పేర్కొంది. తుది ఫలితాల్లో వైసీపీకి 151, టీడీపీ 23, జనసేనకు 1 సీట్లు వచ్చాయి. దీంతో ఈ సారి ఫలితాల్లో ఇండియా టుడే సర్వే నిజమవుతుందా లేదా అనేది వేచి చూడాలి.
Similar News
News October 15, 2025
భారీగా తగ్గిన IPL విలువ

ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) విలువ వరుసగా రెండో ఏడాది పడిపోయింది. 2023లో రూ.93,500 కోట్లున్న వాల్యూ 2024 సీజన్ నాటికి రూ.82,700కు తగ్గింది. 2025లో మరో రూ.6,600 కోట్లు తగ్గి రూ.76,100 కోట్లకు పడిపోయింది. గతేడాదితో పోల్చితే 8% డ్రాప్ నమోదైంది. స్పాన్సర్స్గా ఉన్న బెట్టింగ్ యాప్స్ బ్యాన్ అవడం, TVని డిజిటల్ మీడియా ఓవర్టేక్ చేయడం తదితర అంశాలు ఇందుకు కారణాలు.
News October 15, 2025
జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా దీపక్ రెడ్డి

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పేరు ఖరారైంది. కీర్తీ రెడ్డి, పద్మా వీరపునేని, ఆలపాటి లక్ష్మీనారాయణ, ఆకుల విజయ, కొంపల్లి మాధవి టికెట్ కోసం పోటీ పడ్డా చివరికి దీపక్ వైపే అధిష్ఠానం మొగ్గు చూపింది. కాగా 2023 ఎన్నికల్లోనూ దీపక్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు.
News October 15, 2025
ఇక సెలవు.. ఆయుధం వదిలిన ‘అడవిలో అన్న’

మావోయిస్టు పార్టీలో ఓ శకం ముగిసింది. 40 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి టాప్ కమాండర్ మల్లోజుల వేణుగోపాల్ సెలవు పలుకుతూ జనజీవన స్రవంతిలో కలిశారు. 1981లో అజ్ఞాతంలోకి వెళ్లి ఏటూరునాగారం దళ సభ్యుడిగా ఆయుధం చేతబట్టారు. పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. 1993లో DKS జడ్పీ సభ్యుడిగా, 1995లో కేంద్ర కమిటీ సభ్యుడిగా, 2007లో పొలిట్ బ్యూరో సభ్యుడిగా నియమితులయ్యారు. 4 దశాబ్దాల్లో ఎన్నో ఎన్కౌంటర్లకు నాయకత్వం వహించారు.