News November 24, 2024
2022లో చంద్రబాబు బస్సుపై రాళ్ల దాడి.. కేసు UPDATE

2022లో చంద్రబాబు బస్సు యాత్రపై రాళ్ల దాడి ఘటనలో సంబంధమున్న నలుగురిని పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. సజ్జనరావు, కిశోర్, కార్తీక్‌లను శనివారం ఉదయం అదుపులోకి తీసుకోగా శ్రీనివాస్ అనే వ్యక్తిపై తాజాగా కేసు నమోదైంది. నందిగామ పోలీసులు వీరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 2022 నవంబర్ 5న చంద్రబాబు బస్సు యాత్ర చేస్తుండగా నందిగామలో ఈ ఘటన జరగగా, తాజాగా ఏసీపీ తిలక్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు.
Similar News
News February 28, 2026
కృష్ణా: జిల్లాలో 124 మంది గైర్హాజరు

ఇంటర్మీడియట్ పరీక్షల్లో భాగంగా శనివారం ద్వితీయ సంవత్సరం వృక్ష శాస్త్రము, హిస్టరీ పరీక్షలు నిర్వహించారు. జిల్లాలో 63 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతుండగా, 7,374 మంది విద్యార్థులకు 7,293 మంది హాజరయ్యారని ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి సరళాదేవి తెలిపారు. 124 మంది గైర్హాజరయ్యారని, పరీక్ష సమయంలో ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు కాలేదన్నారు.
News February 28, 2026
కృష్ణా: పర్యావరణ పరిరక్షణకు కలెక్టర్ పిలుపు

పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ జిల్లా కలెక్టర్ డీ.కే బాలాజి శనివారం సైకిల్‌పై విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలుష్య నివారణ కోసం ప్రతి శనివారం ఉద్యోగులందరూ నడక లేదా సైకిల్ ద్వారానే కార్యాలయానికి రావాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ స్వయంగా సైకిల్ తొక్కడం అందరిలోనూ స్ఫూర్తిని నింపింది.
News February 28, 2026
మినుము, పెసల కొనుగోలుకు సర్వం సిద్ధం: కృష్ణా జిల్లా జేసీ

రబీ సీజన్ అపరాల కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ శుక్రవారం ప్రకటించారు. క్వింటా మినుములకు రూ.7,800, పెసలకు రూ. 8,768 మద్దతు ధర నిర్ణయించినట్లు వెల్లడించారు. కొనుగోలు కేంద్రాల్లో పూర్తి పారదర్శకత పాటిస్తామని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా ప్రభుత్వం ద్వారానే విక్రయాలు సాగుతాయని ఆయన స్పష్టం చేశారు.


