News January 28, 2026
2023లోనూ ఆ విమానానికి ప్రమాదం!

అజిత్ పవార్ మరణానికి కారణమైన విమానం గురించి సంచలన విషయం బయటికొచ్చింది. ఇదే విమానం 2023 సెప్టెంబర్‌లోనూ ప్రమాదానికి గురైనట్లు తెలిసింది. VSR వెంచర్స్ ఆపరేట్ చేస్తున్న Learjet 45 ఎయిర్ క్రాఫ్ట్ విశాఖపట్నం నుంచి ముంబై వెళ్తుండగా ల్యాండింగ్ సమయంలో క్రాష్ అయింది. భారీ వర్షం కారణంగా రన్ వే నుంచి పక్కకు జారిపోయింది. ఆ ఘటనలో 8 మంది గాయపడ్డారు. ఇప్పుడు కూడా ల్యాండింగ్ సమయంలోనే ప్రమాదం జరగడం గమనార్హం.
Similar News
News February 20, 2026
B.Ed సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదల

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ B.Ed మొదటి సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఈ మేరకు యూనివర్సిటీ పరీక్షల విభాగం అధికారి డాక్టర్ ఉదయ్ భాస్కర్ విడుదల చేశారు. కాగా ఈ పరీక్షలు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు జరగాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా వేశారు. దీనితో కొత్త తేదీలను ప్రకటించారు. ఈనెల 24 నుంచి మార్చి 2వ తేదీ వరకు మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు జరుగుతాయని తెలిపారు.
News February 20, 2026
తండ్రి హెల్త్ అప్డేట్స్ బయటకు రావడంపై సల్మాన్ అసంతృప్తి

సల్మాన్ ఖాన్ తండ్రి, రచయిత సలీమ్ ఖాన్ ఆరోగ్య <<19171270>>పరిస్థితి<<>> విషమంగానే ఉంది. 90 ఏళ్ల ఆయనకు ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోంది. అయితే సలీమ్ హెల్త్ అప్డేట్స్ బయటికి రావడంపై ఆసుపత్రి వర్గాలపై సల్మాన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కొద్దిసేపటి క్రితం ఆయన కుటుంబీకులతో కలిసి హాస్పిటల్‌కు వెళ్లారు. తన తండ్రి హెల్త్ అప్డేట్స్ ఏవీ బయటికి చెప్పొద్దని, ప్రైవసీ మెయింటెన్ చేయాలని సూచించారు.
News February 20, 2026
ఇతరుల చేతి నుంచి తీసుకోకూడని వస్తువులు ఇవే..

నూనె, ఉప్పు, గుడ్లు.. ఇతరులు ఇస్తున్నప్పుడు వీటిని నేరుగా చేతితో తీసుకోకూడదని పండితులు చెబుతున్నారు. ‘శాస్త్రం ప్రకారం ప్రతి వ్యక్తికి ఓ ప్రత్యేక శక్తి ఉంటుంది. వస్తు మార్పిడితో ఆ శక్తి బదిలీ అయ్యే అవకాశాలుంటాయి. అలా.. వీటిని తీసుకుంటే వారి నెగటివ్ ఎనర్జీ కూడా రావొచ్చు. తద్వారా వారి కష్టాలు, దోషాలు సైతం అంటుతాయని నమ్మకం. వీటిని కింద పెట్టమని చెప్పి ఆ తర్వాత తీసుకోవడం మంచిది’ అని సూచిస్తున్నారు.


