News December 31, 2024

2024లో ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..!

image

కృష్ణా జిల్లాలో 2024 లో 9,719 కేసులు నమోదయ్యాయని SP ఆర్.గంగాధర్ అన్నారు. మంగళవారం ఆయన మచిలీపట్నంలో 2024 సంవత్సర నేరగణాంకాల నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2023లో 9,813 కేసులు నమోదవ్వగా 2024లో ఆ సంఖ్య తగ్గిందన్నారు. పోలీసు శాఖ చేపట్టిన ముందస్తు చర్యలు, కమ్యూనిటి పోలీసింగ్ కారణంగా నేరాల సంఖ్య తగ్గిందని పేర్కొన్నారు.

Similar News

News January 18, 2025

కృష్ణా: ప్రయాణికుల కోసం ప్రత్యేక రైలు

image

సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల సౌలభ్యం మేరకు విజయవాడ మీదుగా విశాఖపట్నం(VSKP)- చర్లపల్లి(CHZ) మధ్య శనివారం ప్రత్యేక రైలును అధికారులు నడుపుతున్నారు. ఈ మేరకు రైలు నం.08549 VSKP- CHZ రైలును శనివారం నడుపుతామన్నారు. ఈ రైళ్లలో 4 జనరల్ కోచ్‌లు, 9 స్లీపర్ కోచ్‌లు ఉంటాయని తెలిపారు. ఈ రైలు మధ్యాహ్నం 2.55 కి విజయవాడ, రాత్రి 9 గంటలకు చర్లపల్లి చేరుకుంటుందని వివరించారు.

News January 18, 2025

కృష్ణా: పరీక్షా ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఆగస్టు- 2024లో నిర్వహించిన ఫార్మ్-డీ కోర్సు 1, 4వ ఏడాది రెగ్యులర్ పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకు అధికారిక వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.in/ చెక్ చేసుకోవాలని ANU పరీక్షల విభాగం సూచించింది.

News January 18, 2025

కృష్ణా: LLM పరీక్షల షెడ్యూల్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలోని కళాశాలల్లో LLM కోర్సు(2024-25 విద్యా సంవత్సరం) చదివే విద్యార్థులు రాయాల్సిన 3వ సెమిస్టర్ థియరీ పరీక్షలను 2025 ఫిబ్రవరి 10 నుంచి నిర్వహిస్తామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఈ నెల 27లోపు ఎలాంటి ఫైన్ లేకుండా ఫీజు చెల్లించాలని, పూర్తి వివరాలకు https://kru.ac.in అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని KRU పరీక్షల విభాగం తెలిపింది.