News December 30, 2024
2024లో మారిన నెల్లూరు రాజకీయ ముఖచిత్రం
2024లో సార్వత్రిక ఎన్నికలు నెల్లూరు జిల్లా రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేశాయి. నెల్లూరు MP సీటుతో పాటు 10 అసెంబ్లీ స్థానాల్లో TDP గెలిచింది. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అన్ని స్థానాలను గెలిచిన YCP 2024 ఎన్నికల్లో పూర్తిగా పట్టు కోల్పోయింది. సూళ్లూరుపేట నుంచి విజయశ్రీ, ఉదయగిరి నుంచి కాకర్ల సురేశ్, కోవూరు నుంచి ప్రశాంతి రెడ్డి, కావలి నుంచి కృష్ణారెడ్డి మొదటిసారి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు.
Similar News
News January 6, 2025
నెల్లూరు: సంక్రాంతి ట్రైన్లు.. 8 గంటలకు బుకింగ్
➤ చర్లపల్లి-తిరుపతి(07077): 6వ తేదీ
➤ తిరుపతి-చర్లపల్లి(07078): 7వ తేదీ
➤ చర్లపల్లి-తిరుపతి(02764):8, 11, 15 వ తేదీ
➤ కాచిగూడ-తిరుపతి(07655): 9, 16వ తేదీ
➤ తిరుపతి-కాచిగూడ(07656): 10, 17వతేదీ
పై ట్రైన్లు నెల్లూరు, గూడూరు జంక్షన్లలో ఆగుతాయి. వీటికి ఇవాళ ఉదయం 8 గంటలకు బుకింగ్ ప్రారంభం అవుతుంది.
News January 6, 2025
నెల్లూరు: నకిలీ పెన్షన్ల ఏరివేతకు రంగం సిద్ధం
నెల్లూరు జిల్లాలో నకిలీ పెన్షన్ల ఏరివేతకు రంగం సిద్ధమైంది. జిల్లాలో దాదాపు మూడు లక్షల మంది పెన్షన్లు పొందుతున్నారు. వాటిలో చాలా వరకు బోగస్వే అన్న ఆరోపణల నేపథ్యంలో ఇవాల్టి (సోమవారం) నుంచి వాటి లెక్కను ప్రభుత్వం తేల్చనుంది. పెద్దాస్పత్రిలోని డాక్టర్ల బృందం ఇంటింటికి తిరిగి లబ్ధిదారుల నుంచి వివరాలను సేకరించి ఆ నివేదికను ప్రభుత్వానికి అందించనుంది.
News January 6, 2025
భాష ఆగిపోతే శ్వాస ఆగిపోయినట్లే: వెంకయ్య నాయుడు
భాష ఆగిపోతే శ్వాస ఆగిపోయినట్లేనని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభల సందర్భంగా ఉద్ఘాటించారు. హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో జరుగుతున్న 12వ ద్వైవార్షిక మహాసభల రెండో రోజున ఆయన పాల్గొన్నారు. మాతృభాషకు ప్రాధాన్యం ఇవ్వడం మనందరి బాధ్యతని, మన భవిష్యత్తు తరాలకు భాషా సంప్రదాయాలు అందించాలన్నారు. ఇంగ్లీషు వ్యామోహం వదిలి తెలుగును బతికించుకోవాలన్నారు.