News December 30, 2024
2024లో మారిన నెల్లూరు రాజకీయ ముఖచిత్రం
2024లో సార్వత్రిక ఎన్నికలు నెల్లూరు జిల్లా రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేశాయి. నెల్లూరు MP సీటుతో పాటు 10 అసెంబ్లీ స్థానాల్లో TDP గెలిచింది. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అన్ని స్థానాలను గెలిచిన YCP 2024 ఎన్నికల్లో పూర్తిగా పట్టు కోల్పోయింది. సూళ్లూరుపేట నుంచి విజయశ్రీ, ఉదయగిరి నుంచి కాకర్ల సురేశ్, కోవూరు నుంచి ప్రశాంతి రెడ్డి, కావలి నుంచి కృష్ణారెడ్డి మొదటిసారి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు.
Similar News
News January 2, 2025
కావలి: ఆశ్రయం కల్పిస్తే.. చంపేశాడు
కావలిలో ఓ మహిళ <<15037512>>హత్యకు<<>> గురైన విషయం తెలిసిందే. పోలీసుల కథనం.. కోల్‌కతాకు చెందిన అర్పిత బిస్వాస్(24) కుటుంబం కావలిలో ఓ చికిత్స కేంద్రం నిర్వహిస్తోంది. వారి బంధువు నయాన్ అనే యువకుడిని హెల్పర్‌గా పెట్టుకుని ఇంట్లోనే ఆశ్రయం ఇచ్చారు. అయితే నయాన్ యజమానిపై కన్నేశాడు. న్యూ ఇయర్ సందర్భంగా అర్పితను ఒప్పించి ఇద్దరూ మద్యం తాగారు. మత్తులోకి జారుకోగా హత్య చేశాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
News January 1, 2025
కావలిలో మహిళ దారుణ హత్య
కావలి గాయత్రీ నగర్‌లోని ఓ ఇంట్లో అర్పిత బిస్వాస్ (24) అనే మహిళను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. స్థానికులు వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన మహిళ ఏడాది క్రితం నుంచి కావలిలో ఓ క్లినిక్ నడుపుతోంది. అక్కడే పనిచేసే యువకుడు హత్య చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న కావలి ఒకటో పట్టణం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News January 1, 2025
నెల్లూరు కార్పొరేషన్‌లో బదిలీలు
నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో పలువురు అధికారులను బదిలీ చేస్తూ కమిషనర్ సూర్యతేజ ఉత్తర్వులు జారీ చేశారు. హౌసింగ్ విభాగం సూపరింటెండెంట్ సిద్ధిక్‌ను మేయర్ పేషీకి, ఎస్టాబ్లిష్‌మెంట్ విభాగంలో ఉన్న బాలసుబ్రహ్మణ్యంను హౌసింగ్ ఇన్‌ఛార్జిగా, లీగల్ సెల్ సూపరింటెండెంట్ ప్రవీణ్‌ను ఎస్టాబ్లిష్‌మెంట్ విభాగానికి బదిలీ చేశారు.