News December 30, 2024

2024: ఉమ్మడి కృష్ణా పొలిటికల్ పిక్చర్ ఛేంజ్

image

ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయ ముఖచిత్రాన్ని 2024 ఎన్నికలు మార్చేశాయి. 2019 ఎన్నికల్లో మొత్తం 16 నియోజకవర్గాల్లో 14 వైసీపీ, టీడీపీ 2 సీట్లలో గెలిచింది. ఈసారి 16 నియోజకవర్గాల్లోనూ కూటమి అభ్యర్థులు విజయ దుందుభి మోగించారు. 2 ఎంపీ సీట్లతో పాటు 13 స్థానాల్లో టీడీపీ, ఒకటి జనసేన, 2 స్థానాల్లో బీజేపీ నెగ్గాయి. మంత్రులుగా కొల్లు రవీంద్ర, పార్థసారథి కొనసాగుతున్నారు. మాజీ మంత్రి కొడాలి నాని ఓడిపోవడం గమన్హారం.

Similar News

News January 22, 2025

ప్ర‌కృతి వ్య‌వ‌సాయం దిశ‌గా ముందడుగు వేయాలి: కలెక్టర్

image

సాగులో పెట్టుబ‌డి వ్య‌యం త‌గ్గించి, ఆదాయం పెంచే ల‌క్ష్యంతో పొలం పిలుస్తోంది పేరుతో రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంతో రైతుల‌ను చేయిప‌ట్టి న‌డిపిస్తోందని క‌లెక్ట‌ర్ జి.ల‌క్ష్మీశ సూచించారు. బుధ‌వారం ఇబ్ర‌హీంప‌ట్నం మండ‌లం, దాములూరులో నిర్వ‌హించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ప్ర‌స్తుతం వ్య‌వ‌సాయం ఎలా ఉంది.? సాగుచేస్తున్న పంట‌లు గురించి అడిగి తెలుసుకున్నారు. 

News January 22, 2025

దుర్గగుడి ప్రధానార్చకులు మృతి

image

విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో దుర్గగుడిలో చాలా సంవత్సరాల నుంచి సేవలందిస్తున్న ప్రధానార్చకులు లింగంభొట్ల బద్రీనాథ్ బాబు మరణించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, ఆలయ అర్చకులు ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. అనారోగ్య రీత్యా మరణించినట్లు సమాచారం.

News January 22, 2025

జి.కొండూరు: ప్రేయసి వెళ్లిపోయిందని సూసైడ్

image

ఇద్దరు పిల్లలున్న ప్రేయసి కాదన్నదని జి.కొండూరులోని చెర్వుమాధవరానికి చెందిన ఇద్దరు పిల్లలకు తండ్రైన ఆటోడ్రైవర్ బాలాజీ (26) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాలు.. మృతుడు మహిళతో ప్రేమలో ఉన్నాడు. ఈ క్రమంలో ప్రేయసిని అడవిలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆ మహిళ ఇకపై కలవడం కుదరదని వెళ్లిపోయింది. మనస్తాపంతో ఆటో స్టార్ట్ చేసే తాడుతో ఉరివేసుకున్నాడు. మృతుని భార్య ఫిర్యాదుతో మైలవరం సీఐ దర్యాప్తు చేపట్టామన్నారు.