News December 30, 2024
2024: ఉమ్మడి గుంటూరు పొలిటికల్ పిక్చర్ ఛేంజ్

ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయ ముఖచిత్రాన్ని 2024 ఎన్నికలు మార్చేశాయి. 2019 ఎన్నికల్లో మొత్తం 17 నియోజకవర్గాల్లో 15 YCP, 2 సీట్లలో TDP గెలిచింది. కాగా ఈసారి 3 ఎంపీ సీట్లతో పాటు 16 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ, ఒక స్థానంలో జనసేన నెగ్గి క్లీన్ స్వీప్ చేశాయి. సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ మంగళగిరి నుంచి 90 వేల మెజార్టీతో నెగ్గడం విశేషం. మంత్రులుగా నారా లోకేశ్, నాదెండ్ల, అనగాని కొనసాగుతున్నారు.
Similar News
News December 3, 2025
ఆచార్య నాగార్జున వర్సిటీలో ఆక్టోపస్ ‘మాక్ డ్రిల్’

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మంగళవారం అర్ధరాత్రి ఆక్టోపస్ బలగాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తులను ఎదుర్కొనేందుకు ఎస్పీ వకుల్ జిందాల్ పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ చేపట్టారు. ఆక్టోపస్ డెల్టా టీమ్, గుంటూరు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఇందులో పాల్గొన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో సన్నద్ధత, ప్రజా రక్షణ కోసమే దీనిని నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
News December 3, 2025
అమరావతి: సచివాలయంలో బారికేడ్ల తొలగింపు

అమరావతి సచివాలయంలో ఇనుప బారికేడ్లను తొలగించారు. బారికేడ్ల వల్ల ప్రజలు, సందర్శకులు ఇబ్బంది పడుతున్నారని గమనించిన సీఎం చంద్రబాబు.. వెంటనే వాటిని తొలగించాలని పోలీసులను ఆదేశించారు. బ్లాకుల ముందు బారికేడ్లకు బదులుగా పూల కుండీలు ఏర్పాటు చేయాలని సూచించారు. దీంతో అధికారులు యుద్ధప్రాతిపదికన బారికేడ్లను తొలగించి, ఆ స్థానంలో అందమైన క్రోటాన్, పూల మొక్కలను ఏర్పాటు చేశారు.
News December 3, 2025
నడింపాలెంలో రూ. 93.82 కోట్లతో CRIYN, 100 పడకల ఆసుపత్రి

ప్రత్తిపాడు మండలం నడింపాలెంలో 100 పడకల ఆసుపత్రి, సెంట్రల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యోగా అండ్ నేచురోపతి (CRIYN) నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. రాజ్యసభ వేదికగా ఎంపీ ఆర్.కృష్ణయ్య ప్రశ్నకు కేంద్ర ఆయుష్ మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ ఈ విధంగా సమాధానం ఇచ్చారు. 15 ఎకరాల విస్తీర్ణంలో రూ.93.82 కోట్ల అంచనాతో ఈ నిర్మాణం ఉండబోతోందని చెప్పారు.


