News December 30, 2024
2024 ఎలక్షన్స్: ఉమ్మడి ప.గో నుంచి మంత్రి, డిప్యూటీ స్పీకర్
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయ ముఖచిత్రాన్ని 2024 ఎన్నికలు మార్చేశాయి. 2019 ఎన్నికల్లో జిల్లా నుంచి 13 నియోజకవర్గాల్లో YCP నెగ్గింది. కాగా ఈ ఎన్నికల్లో మొత్తం 15 నియోజకవర్గాల్లోనూ కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. 10 చోట్ల TDP, ఐదు స్థానాల్లో జనసేన విజయం సాధించాయి. పాలకొల్లు MLA నిమ్మల రామానాయుడు మంత్రి కాగా, రఘురామకృష్ణరాజు తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ స్పీకర్ కావడం కొసమెరుపు.
Similar News
News January 15, 2025
ప.గో : పందేలలో పచ్చకాకిదే హవా
ఉభయగోదావరి జిల్లాల్లో సంక్రాంతి వేళ కోడి పందేల జోరు మామూలుగా లేదు. అయితే అదృష్టాన్ని, సత్తాను పరీక్షించుకునే ఈ కోడి పందేలకు సైతం కుక్కుట శాస్త్రం ఉందని పందెం రాయుళ్లు చెబుతున్నారు. మంగళవారం జరిగిన కోడి పందేల్లో పచ్చ కాకి రంగు కోడి పుంజులు ఎక్కువగా గెలుపొందినట్లు పందెంరాయుళ్లు చెబుతున్నారు. దీంతో కుక్కుట శాస్త్రంలో అవగాహన ఉన్నవాళ్లు మంగళవారం అంతా పచ్చకాకి కోడి పుంజుల హవానే కొనసాగిందని అంటున్నారు.
News January 14, 2025
కొయ్యలగూడెం: మేక మాంసానికి కేజీ కోడి మాంసం ఫ్రీ
కొయ్యలగూడెం పట్టణంలోని టీపీ గూడెం రోడ్డులోని ఓ మాంస కొట్టు వ్యాపారి భారీ ఆఫర్ ప్రకటించారు. రేపు కనుమ సందర్భంగా కిలో మేక మాంసం రూ.800కు కొనుగోలు చేసిన వారికి కిలో కోడి మాంసం ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. అయితే ఈ ఆఫర్ రేపు ఒక్కరోజు మాత్రమే ఉంటుందన్నారు.
News January 14, 2025
ప.గో జిల్లాలో కోసా రూ. 3 వేలు
రసవత్తర పోరులో ఓడి ప్రాణాలు కోల్పోయిన పందెం కోళ్లకు ఉభయగోదావరి జిల్లాల్లో భలే గిరాకీ ధర పలుకుతోంది. అయితే ఇక్కడ పందేనికి సిద్ధం చేసే కోళ్లకు ఓ ప్రత్యేకమైన ఫుడ్ మెనూ ఉంటుంది. దీంతో అవి మరణించాక రుచిగా ఉంటాయని మాంసం ప్రియులు చెబుతూ ఉంటారు. దీంతో పందెంలోని ఒక కోసా రూ. 2వేలు నుంచి రూ.3 వేల వరకు ధర పలుకుతోందని పలువురు అంటున్నారు.