News December 30, 2024

2024 రౌండప్.. చిత్తూరు జిల్లాలో 389 మంది మృతి

image

చిత్తూరు జిల్లాలో 2023తో పోలిస్తే 2024లో రోడ్డు ప్రమాదాలు పెరిగినట్లు అధికారులు తెలిపారు. 2023లో 703 ప్రమాదాలు సంభవించి 351 మంది మృతి చెందగా.. 2024లో 734 ప్రమాదాలు జరిగి 389 మంది మృత్యువాత పడ్డారు. అదేవిధంగా 2023లో సైబర్ కేసులు 58 నమోదవ్వగా.. 2024లో 41 కేసులు నమోదయ్యాయి. హత్యలు 44 జరగగా.. 2024లో 24 జరిగాయి. గతంలో 427 దొంగతనాలు జరగగా, 2024లో 323 జరిగినట్లు అధికారులు తెలిపారు.

Similar News

News January 7, 2025

TPT: PG కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

image

జాతీయ సంస్కృత యూనివర్సిటీ (NSU)లో 2025-26 విద్యా సంవత్సరానికి పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET PG) నోటిఫికేషన్ విడుదలైనట్లు కార్యాలయం పేర్కొంది. అర్హత, ఇతర వివరాలకు https://nsktu.ac.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు. ఆన్‌ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి 2గా పేర్కొన్నారు.

News January 6, 2025

చిత్తూరు: మిడ్ డే మీల్స్‌లో స్వల్ప మార్పు

image

డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో శనివారం ఒక్కరోజు మెనూలో మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని DEO వరలక్ష్మి తెలిపారు. గతంలో శనివారం పాఠశాల విద్యార్థులకు గ్రీన్ లీఫీ వెజ్ రైస్, స్వీట్ పొంగల్, రాగి జావా పెట్టే వారన్నారు. ప్రస్తుతం స్వల్ప మార్పు చేస్తూ.. ఆ స్థానంలో రైస్, సాంబార్, వెజిటేబుల్ కర్రీ, స్వీట్ పొంగల్, రాగి జావా వడ్డించాలన్నారు. మండలధికారులు పర్యవేక్షించాలని సూచించారు.

News January 6, 2025

తిరుపతి: సంక్రాంతి ట్రైన్లు.. 8గంటలకు బుకింగ్

image

➥ చర్లపల్లి-తిరుపతి(07077): 6వ తేదీ
➥ తిరుపతి-చర్లపల్లి(07078): 7వ తేదీ
➥చర్లపల్లి-తిరుపతి(02764):8, 11, 15 వ తేదీ
➥ కాచిగూడ-తిరుపతి(07655): 9, 16వ తేదీ
➥ తిరుపతి-కాచిగూడ(07656): 10, 17వతేదీ
పై ట్రైన్ల బుకింగ్ ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతాయి. గెట్ రెడీ.