News December 31, 2024
2024 Highlights: ప్రధాని మోదీ వరుస ట్వీట్లు

దేశం 2024లో అనేక రంగాల్లో పురోగతి సాధించిందని PM మోదీ అన్నారు. ‘వికసిత్ భారత్’ కలను నిజం చేసేందుకు 2025లో మరింత శ్రమిస్తానని పేర్కొన్నారు. గ్రామీణ విద్యుదీకరణ, ఆర్థిక సమ్మిళితత్వం, డిజిటల్ కనెక్టివిటీ, లింగ సమానత్వం, మహిళా సాధికారత, ప్రాతినిధ్యం, UPI చెల్లింపులు, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాల్లో వృద్ధి, బూమింగ్ స్టార్టప్ ఎకోసిస్టమ్, మార్కెట్ కాన్ఫిడెన్స్‌పై వరుసగా <
Similar News
News January 9, 2026
V2Vతో ప్రమాదాలకు చెక్!

రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్రం ఇకపై అన్ని కొత్త కార్లలో V2V కమ్యూనికేషన్ వ్యవస్థను తప్పనిసరి చేయనున్న <<18804841>>విషయం<<>> తెలిసిందే. ఈ సాంకేతికత ద్వారా వాహనాలు తమ వేగం, దిశ వంటి సమాచారాన్ని ఒకదానితో ఒకటి పంచుకుంటాయి. ఢీకొనే ప్రమాదం ఉంటే డ్రైవర్లను ముందుగానే హెచ్చరిస్తాయి. ప్రమాదకర మలుపుల్లో కూడా ఈ వైర్లెస్ టెక్నాలజీ భద్రతను పెంచుతుంది. వాహనాల మధ్య సమన్వయం పెరగడం వల్ల ట్రాఫిక్ జామ్‌లు తగ్గుతాయి.
News January 9, 2026
తల్లిపాల విషయంలో ఈ అపోహలు వద్దు

పిల్లలకు తల్లిపాలు అమృతతుల్యం. అయితే అపోహలతో కొందరు పిల్లలకు సరిగా పాలు పట్టట్లేదంటున్నారు నిపుణులు. సరిపడా పాలు రావట్లేదని కొందరు ఫార్ములా మిల్క్ ఇస్తుంటారు. కానీ పిల్లల తరచూ పాలు ఇస్తుంటేనే పాలు ఎక్కువగా ఉత్పత్తవుతాయంటున్నారు. అలాగే ఫార్ములా మిల్క్ డైజెస్ట్ అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. తల్లిపాలలో ఇమ్యునిటీ, ఐక్యూ బెటర్‌గా ఉంటుంది కాబట్టి పిల్లలకు తల్లిపాలే ఉత్తమం అని చెబుతున్నారు.
News January 9, 2026
ఇళ్లు, పొలం దగ్గర ఈ మొక్కల పెంపకంతో ఆహారం, ఆరోగ్యం

బొప్పాయి, అరటిలో పిండి పదార్థాలతో పాటు విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఉసిరి, జామ, నిమ్మలో విటమిన్ ‘సి’ అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మునగ, అవిసె, బచ్చలి, ఆకుకూరల నుంచి పీచుపదార్థం, ఖనిజ లవణాలు మెండుగా అందుతాయి. కరివేపాకు క్యాన్సర్ నిరోధకారిగా పనిచేస్తుంది. కుంకుడు తల వెంట్రుకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గుమ్మడి అనేక ఔషధ గుణాలు కలిగి మంచి ఆరోగ్యాన్నిస్తుంది.


