News December 12, 2024
2024: గూగుల్లో అత్యధికంగా సెర్చ్ చేసిన సినిమాలివే..

ఈ ఏడాది అత్యధికంగా సెర్చ్ చేసిన భారతీయ సినిమాల లిస్ట్ను గూగుల్ ట్రెండ్స్ రిలీజ్ చేసింది. ఇందులో శ్రద్ధాకపూర్ నటించిన ‘స్త్రీ2’ తొలి స్థానంలో నిలిచింది. హారర్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమా రూ.700 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆ తర్వాతి స్థానాల్లో కల్కి 2898AD, 12TH FAIL, లాపతా లేడీస్, హనుమాన్, మహారాజ, మంజుమ్మల్ బాయ్స్, గోట్, సలార్, ఆవేశం టాప్-10లో నిలిచాయి.
Similar News
News January 8, 2026
రప్పా రప్పా టీడీపీ విధానం కాదు: లోకేశ్

AP: YCP కుట్రలు, అసత్య ప్రచారాలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని మంత్రి లోకేశ్ పిలుపునిచ్చారు. ఆ పార్టీ మాదిరిగా రప్పా రప్పా TDP విధానం కాదని మంత్రులతో నిర్వహించిన అల్పాహార విందు భేటీలో చెప్పారు. దౌర్జన్యాలు, బెదిరించడం TDP సంస్కృతి కాదని అన్నారు. ప్రజల తీర్పును గౌరవిస్తూ వారికి ఎంత సేవ చేశామనేదే మన అజెండా కావాలని పేర్కొన్నారు. ప్రజావేదికలో వచ్చే అర్జీల పరిష్కారానికి మంత్రులు చొరవచూపాలని కోరారు.
News January 8, 2026
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కల్యాణం

మీ వివాహ ప్రయత్నాలలో పదేపదే అడ్డంకులు ఎదురవుతున్నాయా? కుజ దోషం/సర్ప దోషం వల్ల పెళ్లి ఆలస్యమవుతోందా? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కల్యాణం చేయించుకోవడం ద్వారా దోషాలు తొలగి, వివాహ గడియలు దగ్గరపడతాయి. అంతే కాకుండా కుటుంబంలో అన్యోన్యత, సంతాన సౌభాగ్యం, శత్రు జయం, సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహంతో సమస్త కార్యసిద్ధిని కూడా పొందవచ్చు. మీ పేరు & గోత్రంతో సంకల్పం నమోదు చేసుకుని వెంటనే వేదమందిర్లో <
News January 8, 2026
ఫెడరల్ బ్యాంక్లో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

ఫెడరల్ బ్యాంక్లో ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. టెన్త్ అర్హత కలిగి 18 -20 ఏళ్ల మధ్య వయసు కలిగిన వారు అర్హులు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. ఆప్టిట్యూడ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ FEB 1న నిర్వహిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500, SC, STలకు రూ.100. వెబ్సైట్: https://www.federal.bank.in


