News November 6, 2024
2024 US Elections: X కేంద్రంగా నకిలీ సమాచార వ్యాప్తి
అమెరికా ఎన్నికలపై ఎలాన్ మస్క్ చేసిన నకిలీ, తప్పుడు సమాచార ట్వీట్లకు Xలో ఈ ఏడాది 2 బిలియన్ల వ్యూస్ వచ్చినట్టు సెంటర్ ఫర్ కౌంటరింగ్ డిజిటల్ హేట్ అధ్యయనంలో తేలింది. కీలక రాష్ట్రాల్లో తప్పుడు సమాచార వ్యాప్తికి X కేంద్ర బిందువుగా పని చేసిందని ఆరోపించింది. మస్క్‌కు భారీ సంఖ్యలో ఉన్న ఫాలోవర్స్ వల్ల ఇది పెద్ద ఎత్తున ఇతరుల్ని ప్రభావితం చేయడానికి వీలు కల్పించిందని ఓ ప్రొఫెసర్ తెలిపారు.
Similar News
News November 6, 2024
ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నటి భర్త
నటి స్వర భాస్కర్ భర్త ఫాహద్ అహ్మద్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. ముంబైలోని అనుశక్తి నగర్ నుంచి ఆయన NCP-SP తరఫున పోటీ చేస్తున్నారు. గతంలో సమాజ్‌వాదీ పార్టీలో ఉన్న ఆయన ఇటీవలే NCP-SPలో చేరారు. ఎన్నికల్లో ప్రచారం కోసం తన భర్త క్రౌడ్ ఫండింగ్ స్టార్ట్ చేసినట్లు స్వర ట్వీట్ చేశారు. అతడికి మద్దతుగా నిలిచి విరాళాలు అందించాలని అభ్యర్థించారు. గతేడాది అహ్మద్‌ను స్వర పెళ్లి చేసుకున్నారు.
News November 6, 2024
మరికొన్ని గంటల్లో ముగియనున్న US పోలింగ్
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ మరికొన్ని గంటల్లో ముగియనుంది. పెద్ద ఎత్తున పోలింగ్‌లో పాల్గొంటున్న ఓటర్లు, కేంద్రాల వద్ద బారులు తీరారు. ఒకటి, రెండు రాష్ట్రాలు మినహా అన్నిచోట్లా భారత కాలమాన ప్రకారం ఉదయం 9.30 గంటలకు పోలింగ్ పూర్తి కానుంది. ఆ వెంటనే ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా మొదలవుతుంది. ఇవాళ మధ్యాహ్నం నుంచే ఎర్లీ ట్రెండ్స్‌ను బట్టి ప్రెసిడెంట్ ఎవరనేది తేలిపోనుంది.
News November 6, 2024
అంతరిక్షం నుంచి ఓటేసిన సునీత విలియమ్స్
అమెరికాలో పోలింగ్ సందర్భంగా అంతరిక్షంలో ఉన్న ఆదేశ వ్యోమగాములు అక్కడి నుంచే ఓటేశారు. సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్, డాన్ పెటిట్, నిక్ హాగ్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం వారు అమెరికా జాతీయ జెండాలు కలిగిన సాక్స్‌లు వేసుకొని ‘అమెరికన్లుగా గర్వపడుతున్నాం’ అని సందేశం పంపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను వ్యోమగాములు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.