News December 31, 2024
2024: మీ బెస్ట్, వరస్ట్ మూమెంట్ ఏంటి..?

కాలం ఎప్పటికీ ఆగని చక్రం. నిత్యం ప్రయాణిస్తూ మనకు నేడు అనుభవాలను, రేపటికి జ్ఞాపకాలను అందిస్తుంది. ఎప్పట్లాగే ఈ ఏడాది నేటితో ముగుస్తోంది. లైఫ్ అనే మిక్చర్ పొట్లంలో గుడ్-బ్యాడ్, బెస్ట్-వరస్ట్ పక్కాగా ఉంటాయి. మరి ఈ ఇంగ్లిష్ ఇయర్ మీకు అందించిన బెస్ట్ మూమెంట్ ఏంటి? ఇది బెస్ట్ అనుకునేలా మీరేం చేశారు? ఇక ఇలా జరగకుండా ఉండాల్సింది అనేలా మీకు ఏం జరిగింది? మీరు ఎలా ఫేస్ చేశారు? కామెంట్ చేయండి.
Similar News
News November 26, 2025
వీటిని వంటగదిలో పెడుతున్నారా?

కిచెన్లో గ్యాస్ లీక్, కుక్కర్లు పేలడం, షార్ట్ సర్క్యూట్ ఇలా ఎప్పుడు ఏ ముప్పు ముంచుకొస్తుందో తెలియదు. కిచెన్లోనే ఫ్రిడ్జ్, ఓవెన్ ఉంటే ప్రమాద తీవ్రత ఎక్కువ. ఇలా కాకుండా ఉండాలంటే వీటిని వెంటిలేషన్ ఎక్కువగా వచ్చే ప్రాంతంలో పెట్టాలి. అలాగే ఒవెన్, ఫ్రిడ్జ్, గ్యాస్ స్టవ్ దూరంగా ఉంచాలి. ఓవర్ లోడింగ్, విద్యుత్ హెచ్చుతగ్గులు, పాతవస్తువులు ఉంటే మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
News November 26, 2025
‘సఫ్రాన్’ ఏర్పాటుతో MSMEలకు వ్యాపార అవకాశాలు: సీఎం రేవంత్

TG: HYDలో ‘సఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా’ కొత్త సెంటర్ ప్రారంభోత్సవంలో CM రేవంత్ పాల్గొన్నారు. ఏరోస్పేస్, రక్షణ రంగంలో తెలంగాణ అభివృద్ధికి మైలురాయిగా నిలుస్తుందని ఆయన తెలిపారు. ₹13K కోట్ల పెట్టుబడితో ఏర్పాటైన ఈ సెంటర్తో స్థానిక MSMEలకు, ఇంజినీరింగ్ కంపెనీలకు కొత్త వ్యాపార అవకాశాలు లభిస్తాయన్నారు. బెంగళూరు-HYDను డిఫెన్స్& ఏరోస్పేస్ కారిడార్గా ప్రకటించాలని PMకు విజ్ఞప్తి చేశారు.
News November 26, 2025
BREAKING: తుఫాన్.. పలు జిల్లాల్లో వర్షాలు

AP: మలక్కా జలసంధి ప్రాంతంలో తీవ్ర వాయుగుండం తుఫానుగా బలపడినట్లు APSDMA వెల్లడించింది. దీనికి ‘సెన్యూర్’ అనే పేరు పెట్టినట్లు తెలిపింది. ఇది 24 గంటల తర్వాత క్రమంగా బలహీనపడుతుందని పేర్కొంది. అలాగే నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరికొన్ని గంటల్లోనే తీవ్ర అల్పపీడనంగా, 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందంది. వీటి ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.


