News December 30, 2024

2024 రౌండప్.. చిత్తూరు జిల్లాలో 389 మంది మృతి

image

చిత్తూరు జిల్లాలో 2023తో పోలిస్తే 2024లో రోడ్డు ప్రమాదాలు పెరిగినట్లు అధికారులు తెలిపారు. 2023లో 703 ప్రమాదాలు సంభవించి 351 మంది మృతి చెందగా.. 2024లో 734 ప్రమాదాలు జరిగి 389 మంది మృత్యువాత పడ్డారు. అదేవిధంగా 2023లో సైబర్ కేసులు 58 నమోదవ్వగా.. 2024లో 41 కేసులు నమోదయ్యాయి. హత్యలు 44 జరగగా.. 2024లో 24 జరిగాయి. గతంలో 427 దొంగతనాలు జరగగా, 2024లో 323 జరిగినట్లు అధికారులు తెలిపారు.

Similar News

News January 5, 2025

అధికారులు సమన్వయంతో పని చేయాలి: టీటీడీ ఛైర్మన్

image

తిరుమల ఔటర్‌ రింగ్‌ రోడ్డు, కృష్ణతేజ రెస్ట్‌ హౌస్‌లోని క్యూ లైన్లు, పార్కింగ్ ప్రాంతాలను టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్.నాయుడు శనివారం పరిశీలించారు. అనంతరం అన్నమయ్య భవన్‌లో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ, పోలీసు అధికారులతో సమీక్ష  నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైకుంఠ ద్వార దర్శనం కల్పించే కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని కోరారు.

News January 4, 2025

నవోదయ ప్రవేశానికి 18న ఎంపిక పరీక్ష

image

మదనపల్లె మండలంలోని వలసపల్లె నవోదయలో 2025-26 విద్యా సంవత్సరం 6వ తరగతిలో ప్రవేశానికి ఎంపిక పరీక్ష ఈ నెల18న జరుగుతుందని నవోదయ స్కూల్ ప్రిన్సిపల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. https://navodaya.gov.in/ https://cbseitms.rcil.gov.in/nvs/2 హాల్ టికెట్లు / అడ్మిట్ కార్డ్స్ డౌన్ లోడ్ చేసుకొన వచ్చునని తెలిపారు. వివరాలకు హెల్ప్ డెస్క్ 8919956395 ఫోన్ చేయాలన్నారు. లేకపోతే డైరెక్ట్ గా అయినా సంప్రదించాలన్నారు.

News January 4, 2025

కుప్పంలో ఎయిర్‌పోర్టుపై CM చంద్రబాబు కీలక ప్రకటన

image

కుప్పంలో విమానాశ్రయాన్ని నిర్మించాలని ప్రభుత్వం ఆలోచనలో ఉందని CM చంద్రబాబు ప్రకటించారు. కుప్పంలో రెండు దశల్లో విమానాశ్రయాన్ని నిర్మించనున్నారు. మొదటి దశలో 683 ఎకరాలు రన్ వే కోసం, రెండో దశలో 567 ఎకరాలను భవన నిర్మాణాల కోసం సిద్ధం చేశారు. కుప్పంలో ప్రతిపాదించిన ఎయిర్‌పోర్టు ప్రాంతాన్ని అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) సందర్శించి సాధ్యాసాధ్యాలపై నివేదకను అందించింది. దీనిపై అథారిటీ నుంచి ఎన్‌ఓసీ రావాల్సి ఉంది.