News December 29, 2024

2024 రౌండప్.. మెదక్‌లో బీఆర్ఎస్‌కు దెబ్బ !

image

సార్వత్రిక ఎన్నికలు జిల్లా రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేశాయి. అసెంబ్లీ ఎన్నికల్లో BRS కంచుకోటను పదుల పరుచుకుంది. ఉమ్మడి జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలకు 7 స్థానాల్లో BRS విజయం సాధించినప్పటికీ అధికారం కాంగ్రెస్ హస్తగతం అయింది. పటాన్‌చెరు ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో చేరగా, మరికొందరు చేరుతారని ప్రచారం ఉంది. ఉమ్మడి జిల్లాలో సత్తా చాటినప్పటికీ BRSకు కోలుకోలేని దెబ్బ తగిలిందని విశ్లేషకులు అంటున్నారు. COMMENT

Similar News

News January 1, 2025

తరచుగా హాస్టల్స్ తనిఖీ చేయాలి: మంత్రి

image

ప్రతి విద్యార్థి అభివృద్ధే లక్ష్యంగా సిబ్బంది పనిచేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీసీ సంక్షేమ శాఖ సెక్రటరీ, కమిషనర్, ఎంజేపీ గురుకుల సొసైటీ కార్యదర్శి, ఆర్సీఓ, ప్రిన్సిపల్స్, జిల్లా అధికారులతో మంత్రి జూమ్ మీటింగ్ నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. తరచుగా గురుకుల పాఠశాలల హాస్టల్స్ తనిఖీ చేయాలన్నారు. అలసత్వం వహించకుండా ప్రతి విద్యార్థిపై శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

News January 1, 2025

ఉమ్మడి మెదక్ జిల్లాలో నేటి ఉష్ణోగ్రత వివరాలు

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో బుధవారం ఉదయం 8.30 గంటల వరకు నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలోని కోహీర్ 13.6, జహీరాబాద్, గుమ్మడిదల 14.1, న్యాల్కల్ 14.3, ఆర్సీపురం 14.6, ఝరాసంగం 14.7, అందోల్, మొగుడంపల్లి 14.8, మెదక్ జిల్లాలోని శివంపేట 15.0, టేక్మాల్, నర్సాపూర్ 15.6, వెల్దుర్తి 15.9, సిద్దిపేట జిల్లాలోని మర్కూక్ 15.1, వర్గల్, ములుగు 15.5, కుకునూరుపల్లి 16.1°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News January 1, 2025

MDK: ఇందిరమ్మ ఇళ్ల సర్వే.. మీ ఇంటికి వచ్చారా..?

image

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే శరవేగంగా కొనసాగుతోంది. ఈ నెల 31లోగా పరిశీలన చేసి, వివరాలను యాప్‌లో నమోదు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు ఆదేశించారు. ఏ గ్రామంలో సర్వే చేస్తారో ముందు రోజే చాటింపు చేయాలని, ఏ ఒక్క దరఖాస్తును వదిలిపెట్టొద్దు అంటూ ఆయా జిల్లాల కలెక్టర్లు తెలిపారు. అధికారులు సర్వే కోసం మీ ఇంటికి వచ్చారా..? కామెంట్ చేయండి.