News December 19, 2024

2025లో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలి: DEO

image

పరీక్షా పే చర్చ-2025 కార్యక్రమంలో 6 నుంచి 12వ తరగతి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులను అధిక సంఖ్యలో నమోదు చేయించాలని గుంటూరు DEO సీవీ రేణుక ఒక ప్రకటనలో తెలిపారు. డైట్ లెక్చరర్ కె.ప్రసాద్ (బోయపాలెం)ని జిల్లాకు నోడల్ అధికారిగా నియమించామని చెప్పారు. https://innovativeindia.mygov.inలోకి వెళ్లి పాఠశాలలు, కళాశాలల ప్రిన్సిపల్స్ నమోదు చేయించి జిల్లాను అగ్రస్థానంలో నిలపాలన్నారు. 

Similar News

News October 27, 2025

గుంటూరు మిర్చి యార్డులో నేటి ధరలివే.!

image

గుంటూరు మిర్చి యార్డుకు సోమవారం 75వేల బస్తాల ఏసీ సరకు అమ్మకానికి వచ్చింది. ఏసీ రకం మిర్చి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ముఖ్య ధరలు క్వింటాలుకు ఈ విధంగా ఉన్నాయి. పసుపు రకం: రికార్డు స్థాయిలో రూ.20 వేల నుంచి రూ. 23 వేల వరకు పలికింది. తేజా, 355, 341 రకాలు: రూ.10 వేల నుంచి రూ. 16 వేల వరకు ధరలు నమోదయ్యాయి. నంబర్ 5 ఏసీ రకం గరిష్టంగా రూ. 15,500 వరకు ధర పలికింది. నాటు సూపర్ 10: రూ.15వేలు వరకు పలికింది.

News October 27, 2025

GNT: మొంథా తుపాన్.. అనిశ్చితితో రైల్వే ప్రయాణికులు

image

మొంథా తుపాన్ ప్రభావంతో రైల్వే ప్రయాణికులు ఆందోళనలో ఉన్నారు. అప్పటికే జిల్లా అధికారులు భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించడంతో గాలి వానల కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా, కొన్ని సేవలు రద్దు అయ్యే అవకాశం ఉండటంతో.. ప్రయాణం కొనసాగుతుందా?, లేదా? అన్న అనిశ్చితితో ప్రయాణికులు ఉన్నారు. అయితే రైల్వే అధికారులు మాత్రం తుపాను నేపథ్యంలో ఇప్పటివరకు ఎలాంటి హెల్ప్ లైన్ నంబర్లను అందుబాటులో తీసుకురాలేదు.

News October 27, 2025

GNT: తుపాను సహాయక చర్యలకు రూ. 50 లక్షలు విడుదల

image

తుపాను సహాయక చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు రూ. 50 లక్షలను విడుదల చేసింది. ఈ నిధులను బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించడం, సురక్షితమైన తాగునీరు, ఆహారం సరఫరా చేయడం. వైద్య శిబిరాల నిర్వహణ, పారిశుద్ధ్యం, రోడ్లు, నీటిపారుదల ప్రాజెక్టులకు అత్యవసర మరమ్మతులకు వినియోగించుకోవాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది. అవసరమైతే బాధితులను తరలించేందుకు ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకోవాలని సూచించింది.