News January 6, 2026

2025: అన్నమయ్య జిల్లాలో మార్కెటింగ్ శాఖ ఆదాయం ఎంతంటే.!

image

అన్నమయ్య జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ నాటికి మార్కెటింగ్ శాఖకు AMCల నుంచి రూ.7.55 కోట్ల ఆదాయం లభించింది. రాయచోటి-రూ.29 లక్షలు, మదనపల్లె-2.04 కోట్లు, ములకలచెరువు-1.41 కోట్లు, వాల్మీకిపురం-91.43 లక్షలు, కలికిరి-53.77 లక్షలు, అంగల్లు-56.42 లక్షలు, R.కోడూరు-83.90 లక్షలు, రాజంపేట-50.17 లక్షలు, పీలేరు-24.33 లక్షలు, లక్కిరెడ్డిపల్లి-19.98 లక్షలు వచ్చింది. 2024లో రూ.7.15 కోట్ల ఆదాయం లభించింది.

Similar News

News February 15, 2026

నమీబియాపై USA గెలుపు

image

T20WC: చెన్నైలో నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో USA 31 పరుగులతో విజయం సాధించింది. 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా ఆరంభంలో ధనాధన్ బ్యాటింగ్ చేసింది. 10 ఓవర్ల వరకు 9కి పైగానే రన్‌రేట్ మెయింటేన్ చేసింది. ఆపై వరుసగా వికెట్లు కోల్పోయి విజయానికి దూరమైంది. చివరకు 6 వికెట్లు కోల్పోయి 168 పరుగుల వద్ద ఆగిపోయింది. ఈ ఓటమితో నమీబియా టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది.

News February 15, 2026

జనగామ కలెక్టరేట్‌లో ప్రజావాణి రద్దు

image

జనగామ కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రేపు (ఫిబ్రవరి 16) రద్దు చేసినట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా రేపు మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక ఉండడం, ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు‌ జిల్లా ప్రజలు గమనించాలని కోరారు.

News February 15, 2026

HYD: అద్దెగాడిద కష్టం.. యజమాని ఇష్టం!

image

అద్దెగాడిద కష్టం.. యజమాని ఇష్టం అన్న సామెత ​నగరంలో అద్దెకు ఉండేవారి పరిస్థితి సరిపోతుంది. ARV పేరుతో ప్రభుత్వం పన్నులు పెంచుతుంటే, ఆ భారాన్ని కిరాయిదారుల మీదకు నెడుతున్నారు. చట్టప్రకారం ‘రెంటల్ కంట్రోల్’ ఉన్నా, అది కేవలం పుస్తకాలకే పరిమితమైంది. ‘పన్ను పెరిగింది అద్దె పెంచుతున్నా’ అనే యజమానుల తీరుతో సామాన్యులు విలవిలలాడుతున్నారు. అగ్రిమెంట్లు లేకపోవడంతో కిరాయిదారులకు కోర్టుకెళ్లే ధైర్యం లేకపోయింది.