News December 27, 2025

2025 అల్లూరి జిల్లాలో జరిగిన సంచలన సంఘటనలు ఇవే..!

image

అల్లూరి జిల్లాలో మావోయిస్టులకు షెల్టర్ జోన్‌గా ఉన్న మారేడుమిల్లిలో నవంబర్ 18,19 తేదీల్లో జరిగిన రెండు ఎన్‌కౌంటర్లలో మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో పాటు 13మంది మావోలు మృతి చెందారు. ఈ సంఘటన మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. డిసెంబర్ 12న చింతూరు మండలం ఘాట్ రోడ్డులో టూరిస్ట్ బస్సు బోల్తా కొట్టి 9మంది యాత్రికులు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

Similar News

News December 30, 2025

వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం

image

కలియుగ వైకుంఠం తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ <<18708686>>వేకువజామున<<>> శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. తర్వాత VIP బ్రేక్ దర్శనాలను ప్రారంభించారు. 5.30AM నుంచి ఈ-డిప్‌లో టోకెన్లు పొందిన వారిని అనుమతివ్వనున్నారు. సోమవారం రాత్రి వరకు 55వేల మంది భక్తులు తిరుమలకు చేరుకున్నట్లు అంచనా. TG CM రేవంత్ రెడ్డి, పలువురు AP మంత్రులు సహా పెద్ద సంఖ్యలో VIPలు చేరుకున్నారు.

News December 30, 2025

వరంగల్: ఉదయం 6 నుంచే యూరియ విక్రయం!

image

వరంగల్ జిల్లాలో రైతుల పంటలకు ఉపయోగించే యూరియ కౌంటర్లు ఉ.6 గం.కు తెరిచి విక్రయించవచ్చని కలెక్టర్ సత్య శారద అధికారులను అదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. అవసరం అయితే మరిన్ని కౌంటర్లు ఏర్పాటు చేస్తామని, జిల్లాలో యూరియా డీలర్స్ దగ్గర 434 టన్నుల యూరియా స్టాక్ ఉందన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 14375 టన్నులు పంపిణీ చేశామని అన్నారు.

News December 30, 2025

ప్రైవేటు వ్యక్తుల ప్రతినిధిలా చంద్రబాబు: గుడివాడ అమర్నాథ్

image

AP: ప్రజలు ఎన్నుకున్న సీఎంలా కాకుండా, ప్రైవేటు వ్యక్తుల ప్రతినిధిలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. విద్య, వైద్యం, వ్యవసాయం, రోడ్లు.. ఇలా అన్ని రంగాలను ప్రైవేటుపరం చేస్తున్నారని ఆరోపించారు. పీపీపీ ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవచ్చని చెప్పడం దారుణమన్నారు. రానున్న రోజుల్లో పరిపాలనను కూడా ప్రైవేటుపరం చేస్తారేమోనని ఎద్దేవా చేశారు.