News December 30, 2025

2025: సెలబ్రిటీల కొత్త ఛాప్టర్

image

టాలీవుడ్‌లో పలువురు సెలబ్రిటీలు ఈ ఏడాది కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. జూన్ 6న హీరో అఖిల్-జైనబ్‌, DEC 1న హీరోయిన్ సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు ఒక్కటయ్యారు. చిన్నారి పెళ్లి కూతురు ఫేమ్ అవికా గోర్ తన ప్రియుడు మిలింద్ చంద్వానీని పెళ్లి చేసుకున్నారు. హీరో నారా రోహిత్ నటి శిరీషను వివాహం చేసుకోగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తన ప్రేయసి హరిణ్యను, విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండు హర్షితను వివాహమాడారు.

Similar News

News January 29, 2026

పిల్లల్లో కడుపునొప్పికి కారణాలు

image

పసిపిల్లల్లో కడుపునొప్పి వివిధ కారణాల వల్ల వస్తుంది. సాధారణంగా వైరస్‌, బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు, నులి పురుగులు, కోలిక్ సమస్య వల్ల చిన్నారుల్లో కడుపునొప్పి వస్తుంది. సాధారణంగా ఇవి రెండురోజుల్లో తగ్గిపోతాయి. తగ్గకపోగా విరేచనాలు, వాంతులు కూడా అవుతుంటే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. ఇంట్లో ఉండి నాటు వైద్యాలు చేయడం వల్ల పరిస్థితి ప్రమాదకరంగా మారొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

News January 29, 2026

పిల్లల్లో నొప్పులను ఎలా గుర్తించాలంటే?

image

నెలల పిల్లలు నొప్పి వచ్చినపుడు కళ్లు గట్టిగా మూసుకుంటారు. నోరు వెడల్పుగా తెరుస్తారు. నుదురు చిట్లిస్తారు. ముక్కు రంధ్రాలను వేగంగా కదిలిస్తారు. చెవిలో నొప్పి పుడుతుంటే చెవులు లాక్కొంటారు. తలనొప్పిగా ఉంటే తలను ఒక వైపు నుంచి మరోవైపునకు తిప్పుకుంటారు. ఒకేవైపు పడుకొని, కాళ్లు పొట్టలోకి ముడుచుకొంటారు. నొప్పి ఉన్న భాగాన్ని కదల్చకుండా ఉండేందుకు ప్రయత్నిస్తారని నిపుణులు చెబుతున్నారు.

News January 29, 2026

గూగుల్ డేటా సెంటర్‌కు FEBలో శంకుస్థాపన!

image

AP: విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు పనులు తుది దశకు చేరుకున్నాయని కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ తెలిపారు. FEBలోనే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగే అవకాశాలున్నాయన్నారు. ఆనందపురం(M) తర్లువాడ వద్ద డేటా సెంటర్ కోసం 308 ఎకరాల భూమిని సిద్ధం చేసినట్లు తెలిపారు. భూసేకరణలో 51 మంది డీపట్టా రైతుల్లో 49 మంది భూములిచ్చేందుకు అంగీకరించారని, మిగిలిన వారు 2-3 రోజుల్లో ఇవ్వనున్నట్లు చెప్పారు.