News July 29, 2024
భారత్‌లోనే 2025 ఆసియా కప్

వచ్చే ఏడాది పురుషుల ఆసియా కప్ టీ20 ఫార్మాట్‌లో ఇండియాలో జరగనుంది. ఈ విషయాన్ని ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ స్పాన్సర్‌షిప్ రైట్స్ కోసం రిలీజ్ చేసిన ఇన్విటేషన్ నోటిఫికేషన్‌లో పేర్కొంది. అలాగే 2027 ఎడిషన్ 50 ఓవర్ల ఫార్మాట్‌లో బంగ్లాదేశ్‌లో నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ రెండు టోర్నీల్లో మొత్తం 6 జట్లు పాల్గొంటాయి. 2026 మహిళల ఆసియా కప్ టీ20 ఫార్మాట్‌లో జరగనుండగా, వేదికపై స్పష్టత రావాల్సి ఉంది.
Similar News
News April 10, 2026
రష్యాvs ఉక్రెయిన్.. యుద్ధానికి 2 రోజులు బ్రేక్

రష్యా, ఉక్రెయిన్ మధ్య నాలుగేళ్లుగా కొనసాగుతున్న యుద్ధానికి 2 రోజులు బ్రేక్ పడనుంది. క్రిస్టియన్లకు పవిత్రమైన ఆర్థడాక్స్ ఈస్టర్ సందర్భంగా ఈనెల 11న 4PM గంటల నుంచి 12న అర్ధరాత్రి వరకు కాల్పుల విరమణ పాటించనున్నట్లు పుతిన్ ప్రకటించారు. ఉక్రెయిన్ ప్రతిపాదన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్రెమ్లిన్ తెలిపింది. కాగా ప్రస్తుతం US దృష్టి ఇరాన్ వైపు మళ్లడంతో ఉక్రెయిన్, రష్యా మధ్య చర్చలు ఆగిపోయాయి.
News April 10, 2026
13 ఏళ్లలోపు పిల్లలకు SM దూరం.. లోకేశ్ కీలక ఆదేశాలు

APలో 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను దూరంగా ఉంచేందుకు డ్రాఫ్ట్‌ను సిద్ధం చేయాలని మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు. అలాగే 13-16 ఏళ్ల వారికి వయసును బట్టి కంటెంట్ అందుబాటులో ఉండేలా విధివిధానాలు రూపొందించాలని సూచించారు. SMలో మహిళలపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. నిన్న రాత్రి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు.
News April 10, 2026
ఇలాంటి వారికి చేసే సాయం.. వ్యర్థం!

ప్రియములేని విందు పిండివంటల చేటు
భక్తిలేని పూజ పత్రి చేటు
పాత్రమెఱుగనీవిబంగారు చేటురా
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: ప్రేమ, ఆప్యాయత లేకుండా పెట్టే విందులో ఎన్ని పిండి వంటలున్నా వ్యర్థమే. భక్తి, శ్రద్ధ లేకుండా చేసే పూజకు వాడే పూలు దండగ. ఇదే తీరున యోగ్యత, అర్హత లేని వారికి చేసే దానం వల్ల ప్రయోజనం ఉండదు.
<<-se>>#PADHYAM<<>>


