News January 1, 2025
2025: తొలిరోజు స్టాక్మార్కెట్లు ఎలా ట్రేడవుతున్నాయంటే..

కొత్త ఏడాది తొలిరోజు దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెలవు కావడంతో ఆసియా మార్కెట్ల నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదు. దీంతో మదుపరులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. సెన్సెక్స్ 78,033 (-110), నిఫ్టీ 23,597 (-50) వద్ద చలిస్తున్నాయి. మీడియా మినహా అన్ని రంగాల షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది. APOLLOHOSP, LT, ASIANPAINT, INFY, BRITANNIA టాప్ గెయినర్స్. BAJAJ AUTO, ADANI PORTS టాప్ లూజర్స్.
Similar News
News January 27, 2026
TODAY HEADLINES

* దేశవ్యాప్తంగా ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు
* రేపు బ్యాంకులు బంద్!
* AP: పేదరిక నిర్మూలనే లక్ష్యం: గవర్నర్ నజీర్
* ప్రభుత్వ సేవల్లోనూ ఏఐ పాత్ర పెరగాలి: CBN
* TDP పతనానికి లోకేశ్ నాంది: అంబటి
* TG: 3 ట్రిలియన్ డాలర్ల ప్రగతే లక్ష్యం: జిష్ణుదేవ్
* పట్టణ పేదలకు 72 గజాల భూమి: పొంగులేటి
* TG బడ్జెట్లో నీళ్లు, నిధులు, నియామకాలకు ప్రాధాన్యం
* రేవంత్ మాట్లాడుతుంటే టీవీలు ఆఫ్ చేయండి: KTR
News January 27, 2026
ఇండియా-EU ట్రేడ్ డీల్.. ఆటో స్టాక్స్లో ఆందోళన!

భారత్-EU మధ్య ట్రేడ్ డీల్ కుదరడంతో మంగళవారం ఆటోమొబైల్ షేర్లపై ఇన్వెస్టర్లు ఫోకస్ చేయనున్నారు. యూరోపియన్ కార్లపై దిగుమతి సుంకాలను 110% నుంచి 40%కి తగ్గించే అవకాశముందని సమాచారం. అదే జరిగితే భారత ఆటో మార్కెట్లో పోటీ పూర్తిగా మారనుంది. దేశీయ కంపెనీలపై ప్రతికూల ప్రభావం ఉంటుందనే చర్చ జరుగుతోంది. దీంతో స్టాక్ మార్కెట్లో ఆటో షేర్లు ఒడుదొడుకులకు లోనయ్యే సూచనలు కనిపిస్తున్నాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
News January 27, 2026
18 ఏళ్ల చర్చల తర్వాత ఇండియా-EU ట్రేడ్ డీల్ ఖరారు

దాదాపు 18 ఏళ్ల సుదీర్ఘ చర్చల తర్వాత భారత్, యూరోపియన్ యూనియన్ (EU) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారైంది. ఈ చారిత్రక ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’ను మంగళవారం అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ ఒప్పందంతో ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు భారీగా పెరగనున్నాయి. రాబోయే 6 నెలల్లోపు అధికారిక సంతకాలు పూర్తయ్యి 2027 ప్రారంభం నాటికి ఈ ఒప్పందం అమల్లోకి రానుంది.


