News February 27, 2026

2026లో భారీ బడ్జెట్ సినిమాలు.. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తాయా?

image

ఈ ఏడాది బాలీవుడ్‌లో భారీ బడ్జెట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. రణ్‌బీర్, సాయిపల్లవి జంటగా ₹4000Crతో తెరకెక్కిస్తున్న ‘రామాయణ-1’ దీపావళికి రిలీజ్ కానుంది. MAR 19న ధురంధర్-2(₹300Cr) మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయాలని చూస్తోంది. యశ్ ‘టాక్సిక్’(₹500Cr) కూడా అదేరోజు రానుంది. షారుఖ్ ఖాన్ ‘కింగ్’(₹350Cr).. రణ్‌బీర్, విక్కీ, ఆలియా ‘లవ్ అండ్ వార్’(₹425Cr) రేసులో ఉన్నాయి.

Similar News

News April 12, 2026

KKRకు గుడ్ న్యూస్.. త్వరలో జట్టులోకి పతిరణ

image

ఈ ఏడాది ఐపీఎల్‌లో ఇప్పటి వరకు గెలుపు ఖాతా తెరవని KKRకు శుభవార్త. స్టార్ బౌలర్ మతీషా పతిరణ గాయం నుంచి కోలుకున్నారు. శ్రీలంక క్రికెట్ బోర్డు నుంచి NOC కూడా సాధించారు. దీంతో అతి త్వరలోనే జట్టులో చేరే అవకాశం ఉంది. ఆయన రాకతో KKR బౌలింగ్ విభాగం బలపడనుంది. కాగా కోల్‌కతా 4 మ్యాచ్‌లు ఆడగా మూడింట్లో ఓడింది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది.

News April 12, 2026

‘ఇంటి గుట్టు లంకకు చేటు’.. తెలుసుకోండి!

image

కుటుంబ రహస్యాలను బయటపెట్టడం వల్ల సొంతవారికే తీవ్ర నష్టం కలుగుతుందని చెప్పే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తాం. రామాయణంలో విభీషణుడు లంక రక్షణ వ్యవస్థ గురించి రాముడికి చెబుతారు. అలాగే తన సోదరుడు రావణుడు, ఆయన పిల్లలు ఇంద్రజిత్తు, అతికాయుడి బలాల గురించి వివరిస్తారు. దీనివల్లే లంక నాశనమైంది. మన ఇంటి గోప్యతను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో ఈ సామెత వివరిస్తుంది.
<<-se>>#EPICSAYINGS<<>>