News November 5, 2025
2026 జనవరిలో పర్వదినాలు

JAN 3: పౌర్ణమి వ్రతం, సత్యనారాయణ పూజ
JAN 6: సంకటహర చతుర్థి, JAN 11: ఉత్తరాషాఢ కార్తె
JAN 13: భోగి , JAN 14: మకర సంక్రాంతి, JAN 15: కనుమ
JAN 16: మాస శివరాత్రి, ప్రదోష వ్రతం
JAN 18: చొల్లంగి అమావాస్య, JAN 23: సరస్వతి పూజ
JAN 24: శ్రావణ కార్తె , స్కంద షష్టి
JAN 25: రథసప్తమి, JAN 26: భీష్మాష్టమి
JAN 29: జయ ఏకాదశి, JAN 30: ప్రదోష వ్రతం
Similar News
News November 5, 2025
హనుమకొండలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ

TG: ఈ నెల 10 నుంచి 22 వరకు హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరగనుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు ఇందులో ఎన్‌రోల్ చేసుకోవచ్చు. జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్/స్టోర్ కీపర్, ట్రేడ్స్‌మన్ పోస్టుల భర్తీకి సంబంధించి మార్చి 12న అడ్మిట్ కార్డులు పొందిన వారికే ఈ అవకాశం అని అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాలకు 040-27740059కు కాల్ చేయాలని సూచించారు.
News November 5, 2025
మరో 4 కొత్త రెవెన్యూ డివిజన్లు?

AP: నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే రెవెన్యూ డివిజన్లను సర్దుబాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పీలేరు, అద్దంకి, గిద్దలూరు, మడకశిర కేంద్రాలుగా కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. మరోవైపు కైకలూరు సెగ్మెంట్‌ను కృష్ణా జిల్లాలో, గన్నవరం, నూజివీడులను ఎన్టీఆర్ జిల్లాలో కలపాలనే ప్రతిపాదనలను మంత్రివర్గ ఉపసంఘం పరిశీలిస్తోంది. ఇవాళ వీటిపై చర్చించి ప్రభుత్వానికి సిఫారసు చేయనుంది.
News November 5, 2025
పశువుల్లో రేబీస్ వ్యాధిని ఎలా గుర్తించాలి?

రేబీస్ వ్యాధి సోకిన పశువుల్లో జ్వరం వస్తుంది. తర్వాత కేంద్రనాడీ వ్యవస్థ దెబ్బతినడం వల్ల పశువులు అసాధారణంగా ప్రవర్తిస్తాయి. కండరాలలోని నరాలు దెబ్బతినడం వల్ల పక్షవాతం సోకుతుంది. మేతను మింగలేకపోవడం, నీటిని చూసి భయపడటం, అధిక లాలాజలం స్రవించడం, బలహీనత, ఎక్కువగా అరవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పశువులను కుక్క కరిస్తే సాధ్యమైనంత త్వరగా వెటర్నరీ డాక్టరు సూచనలతో యాంటీరేబీస్ టీకా వేయించాలి.


