News March 27, 2025
2027 డిసెంబర్ కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి: మంత్రి నిమ్మల

పోలవరం ప్రాజెక్టు పనులను 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేసే విధంగా కృషి చేస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ప్రాజెక్టును సందర్శిస్తున్న నేపథ్యంలో బుధవారం ఆయన సీఎం పర్యటించే ప్రాంతాలను పరిశీలించారు. 2027 డిసెంబర్‌కు పూర్తి చేసేందుకు అంతర్జాతీయ నిపుణుల కమిటీ, సీడబ్ల్యుసీ, పీపీఎలను సమన్వయపరుచుకుంటూ డిజైన్లకు అనుమతులు తీసుకుంటున్నామన్నారు.
Similar News
News April 23, 2025
సూర్యాపేట: మార్కులు తక్కువచ్చాయని ఇంటి నుంచి వెళ్లాడు

మార్కులు తక్కువగా వచ్చాయని మనస్తాపానికి గురైన ఇంటర్ విద్యార్థి ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటన మేళ్లచెరువులో జరిగింది. గ్రామానికి చెందిన వట్టెపు సైదులు కుమారుడు సుజిత్ కోదాడలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం ఫలితాలు తెలుసుకున్న అనంతరం కోదాడ బస్టాండ్‌లో చెప్పకుండా వెళ్లిపోయాడు. పేరెంట్స్ కోదాడ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఆచూకీ తెలిసినవారు 98663 73019 నంబర్ కు సంప్రదించాలని కోరారు.
News April 23, 2025
అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తాం: మంత్రి సీతక్క

నర్సంపేట నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని మంత్రి సీతక్క అన్నారు. కొత్తగూడలో వివిధ కార్యక్రమాలకు వెళ్తున్న మంత్రి మార్గమధ్యలోని ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామంలో ఆగారు. స్థానిక నాయకులతో మంత్రి పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాల అమలుపై ఆరా తీశారు. వరంగల్ డీసీసీ అధికార ప్రతినిధి రవీందర్ రావు, తదితరులున్నారు.
News April 23, 2025
ఈ నెల 25న గురుకుల ప్రవేశ పరీక్ష: కలెక్టర్ మహేశ్

ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరంలో 5వ తరగతి ప్రవేశాలకు ఏప్రిల్ 25వ తేదీ ఉదయం 10-12 గంటల వరకు పరీక్ష జరుగుతుందని కలెక్టర్ మహేశ్ కుమార్ బుధవారం తెలిపారు. ఈ పరీక్ష ఫలితాలు మే 14న విడుదల చేస్తారన్నారు. ఏప్రిల్ 25 మధ్యాహ్నం 2.30-5 గంటల వరకు జూనియర్ ఇంటర్ ప్రవేశ పరీక్ష జరుగుతుందన్నారు. ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ డిగ్రీ కాలేజీల్లో పలు కోర్సుల్లో ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 25న జరుగుతుందన్నారు.