News September 10, 2025

2027 నాటికి ప్రాజెక్టులు పూర్తి: మంత్రి ఉత్తమ్

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని SLBC, బ్రహ్మణవెల్లంల, డిండి, పిలాయిపల్లి, ధర్మారెడ్డిపల్లి, బునాదిగాని ప్రాజెక్టులు 2027 నాటికి పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ అన్నారు. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, నీటి పారుదల అధికారులతో జిల్లాలోని ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. చివరి దశలో ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని మండలి ఛైర్మన్ గుత్తా కోరారు. జిల్లాకు రూ.10 వేల కోట్లు కేటాయించాలని మంత్రి కోమటిరెడ్డి అన్నారు.

Similar News

News September 10, 2025

యువత ప్రాణాలు తీస్తున్న బ్రేకప్స్

image

దేశంలో బ్రేకప్‌‌ల వల్ల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని సూసైడ్ ప్రివెంటివ్ హెల్ప్‌లైన్ సంస్థ ‘వన్ లైఫ్’ తెలిపింది. అప్పులు, వైవాహిక సమస్యలు, నిరుద్యోగం, బెట్టింగ్, ఒత్తిడి, ఆర్థిక మోసాలతో మరికొందరు సూసైడ్ చేసుకుంటున్నట్లు వివరించింది. తమ సంస్థకు ఏటా సగటున 23,000 కాల్స్ వస్తున్నాయంది. ఫోన్ చేసిన వారిపై సానుభూతి చూపిస్తూ కౌన్సిలర్లు వారిలో ధైర్యం నింపుతారని వివరించింది.
* ఇవాళ ఆత్మహత్యల నివారణ దినోత్సవం

News September 10, 2025

పటాన్‌చెరులో యాక్సిడెంట్.. మహిళ మృతి

image

గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ORRపై జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డుపై నడిచి వెళ్తున్న మహిళను గుర్తు తెలియని వాహనం ఢీకొనగా అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 10, 2025

KNR: విచ్చలవిడిగా ‘అన్‌వాంటెడ్ ప్రెగ్నెన్సీ’ కిట్స్‌ అమ్మకాలు

image

ఉమ్మడి KNR వ్యాప్తంగా గర్భవిచ్ఛిత్తి కిట్స్‌ను విచ్చలవిడిగా అమ్ముతున్నారు. ప్రెగ్నెన్సీ వద్దనుకునేవారు నేరుగా మెడికల్ షాపులను సంప్రదిస్తుండడంతో ఈ తతంగం సాగుతోంది. దీనిపై ఔషధ నియంత్రణ పరిపాలన విభాగం ప్రత్యేక దృష్టి పెట్టి తనిఖీలు చేపట్టింది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా, మందులకు రశీదివ్వని షాపులపై చర్యలకు పూనుకుంది. ఇష్టారీతిన KITS వినియోగిస్తే తల్లీబిడ్డకు ప్రమాదమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.