News December 26, 2024

2030 నాటికి 20 వేల మెగావాట్ల ఇంధన ఉత్పత్తి: భట్టి

image

2030 నాటికి స్వచ్ఛమైన, స్థిరమైన 20 వేల మెగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళుతుందని ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క అన్నారు. HYDలో ఆయన మాట్లాడుతూ.. హరిత ఇంధనానికి పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి, జాతీయ స్థాయిలో పెట్టుకున్న లక్ష్యాన్ని అందుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ విధానాన్ని ప్రతిపాదించిందన్నారు.

Similar News

News December 27, 2024

ఇల్లందు – కారేపల్లి రహదారిపై రోడ్డుప్రమాదం 

image

సింగరేణి మండల పరిధిలోని ఇల్లందు – కారేపల్లి ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతిచెందిన వ్యక్తిని ఉసిరికాయలపల్లికి చెందిన మల్లయ్యగా స్థానికులు గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఇల్లందు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వారిలో వెంకటేశ్వర్లు పరిస్థితి విషమంగా ఉండటంతో ఖమ్మం తీసుకెళ్లారు. 

News December 27, 2024

మన్మోహన్ సింగ్ మృతి పట్ల పొంగులేటి సంతాపం

image

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి దేశానికి తీరని లోటన్నారు. మన్మోహన్ సింగ్ కుటుంబానికి, అభిమానులకు పొంగులేటి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ దేశంలో అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తుచేసుకున్నారు. కేంద్రమంత్రిగా, ప్రధానిగా దేశానికి నిర్విరామంగా సేవలందించారని కొనియాడారు.

News December 27, 2024

మన్మోహన్ సింగ్ మృతి పట్ల భట్టి సంతాపం

image

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంతాపం వ్యక్తం చేశారు.’గొప్ప ఆర్థికవేత్త, రాజకీయ నాయకుడు, మానవతావాది మన్మోహన్ సింగ్ ఇక లేరు. ఆయన తీసుకున్న నిర్ణయాలు దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించాయి. మన్మోహన్ సింగ్ అసలైన నవభారత నిర్మాత. భరతమాత ఓ గొప్ప మేధావిని కోల్పోయింది’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.