News October 8, 2024
20,310 దరఖాస్తులు.. రూ.406 కోట్ల ఆదాయం

ఏపీలో మద్యం దుకాణాలకు దరఖాస్తుల ప్రక్రియ రేపటితో ముగియనుంది. మొత్తం 3,396 దుకాణాలకు గాను నిన్న రాత్రి వరకు 20,310 దరఖాస్తులు అందాయి. అత్యధికంగా విజయనగరంలో 1,689 దరఖాస్తులొచ్చాయి. రూ.2 లక్షల నాన్ రీఫండ్‌బుల్ రుసుముతో ప్రభుత్వానికి రూ.406. 20కోట్ల ఆదాయం లభించింది. నేడు, రేపు భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
Similar News
News December 4, 2025
Dec 11న మిస్సైల్ టెస్ట్.. NOTAMకు కేంద్రం నోటీస్

విశాఖ తీరంలో మిస్సైల్ పరీక్ష పరిధిని 1,050 కి.మీ నుంచి 1,190 కి.మీకు కేంద్రం విస్తరించింది. DEC 11న మిస్సైల్ పరీక్ష నిర్వహించనున్నట్టు NOTAMకు తెలిపింది. డిసెంబర్ 1-4 మధ్య నిర్వహించే టెస్ట్‌కు 3,485 కి.మీలు డేంజర్ జోన్‌గా గుర్తించాలని నోటీసులిచ్చిన కేంద్రం తర్వాత కాన్సిల్ చేసింది. ATC, రన్ వే రిపేర్లు, ఎయిర్‌స్పేస్ క్లోజింగ్స్, విమాన కార్యకలాపాలు, భద్రతా పర్యవేక్షణలో NOTAMs కీలకంగా పనిచేస్తాయి.
News December 4, 2025
పుతిన్ పర్యటన.. ఫొటోలు పంచుకున్న ప్రధాని

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఢిల్లీ చేరుకున్న విషయం తెలిసిందే. స్వయంగా ప్రధాని మోదీ ఆయనకు స్వాగతం పలికారు. ఒకే కారులో ఇద్దరూ ప్రధాని నివాసానికి చేరుకున్నారు. దీనికి సంబంధించి PM మోదీ కొన్ని ఫొటోలు షేర్ చేశారు. ‘నా ఫ్రెండ్ అధ్యక్షుడు పుతిన్‌ను స్వాగతించినందుకు సంతోషిస్తున్నాను. రేపు మా మధ్య జరగబోయే సమావేశాల కోసం ఎదురుచూస్తున్నాను. భారత్-రష్యా స్నేహం మన ప్రజలకు ఎంతో మేలు చేసింది’ అని ట్వీట్ చేశారు.
News December 4, 2025
పుతిన్ పర్యటన ప్రతి అడుగులో ‘FSO’ నిఘా

అత్యంత పటిష్ఠ భద్రత మధ్య రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటన సాగుతోంది. విదేశీ ప్రముఖుల భద్రతను ఆతిథ్య దేశాలే సహజంగా పర్యవేక్షిస్తుంటాయి. పుతిన్ పర్యటనను మాత్రం రష్యాలోని రహస్య సంస్థ ఫెడరల్ ప్రొటెక్టివ్ సర్వీసెస్ చూస్తుంది. ఆయన ఉండే భవనం, తీసుకొనే ఆహారం సహా ప్రతి అడుగులో పలు జాగ్రత్తలు తీసుకుంటారని మాజీ బాడీగార్డు ఒకరు తెలిపారు. పుతిన్ తినే ఫుడ్‌ను ఫస్ట్ ఓ బాడీగార్డ్ టేస్ట్ చేస్తారని చెప్పారు.


